అసలు కారణం ఇదీ: 10 మంది విద్యార్ధులకు వెస్టర్న్ కెంటకీ వర్శిటీ ఓకే
హైదరాబాద్: అమెరికాలోని వెస్టర్న్ కెంటకీ యూనివర్శిటీలో చేరిన 25 మంది విద్యార్ధులను స్వదేశానికి వెళ్లిపోవాలని ఇటీవల వర్సిటీ అధికారులు సూచించిన సంగతి తెలిసిందే. అయితే భారత విదేశాంగ శాఖ ఒత్తిడి మేరకు 25 మంది విద్యార్ధుల్లో 10 మందిని వర్సిటీలో రెండో సెమిస్టర్ కొనసాగించేందుకు వర్సిటీ అధికారులు అంగీకరించారు.
వివరాల్లోకి వెళితే... స్పాట్ అడ్మిషన్ పేరుతో భారతీయ విద్యార్ధులను కొన్ని ఏజెన్సీలు నమ్మించి నిబందనల గురించి చెప్పకుండా అడ్మిషన్లు ముందుగా ఇచ్చి పీజులు వసూలు చేసిన అనంతరం వర్శిటీ తొలి సెమిస్టర్ పూర్తి అయ్యే సమయంలో మీకు సరైన విద్యార్హతలు లేవని చెప్పి విద్యార్దులపై వేటు వేసింది.

భారత విద్యార్థులకు షాక్: వెళ్లిపోవాలని ఆదేశాలు
దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదనకు లోనయ్యారు. స్పాట్ అడ్మిషన్ ఇచ్చే సమయంలోనే విద్యార్ధులకు అర్హత ఉందా? లేదా అన్న విషయం చూడాలి కానీ, తీరా అడ్మిషన్లు ఇచ్చి, ఫీజులు వసూలు చేసుకుని వర్సిటీలు ఇప్పుడిలా మోసం చేస్తే ఎలాగని కెంటకీ విశ్వవిద్యాలయం భారత విద్యార్థుల సంఘం చైర్మన్ ఆదిత్య శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
విద్యార్ధుల ఆందోళన, తల్లిదండ్రులు ఆవేదనతో పాటు భారత విదేశాంగ ఒత్తడితో దిగొచ్చిన వర్సిటీ అధికారులు ఎవరైతే విద్యార్ధులు జీపీఏ స్కోరు 3.3 లేదా అంతకు సమానంగా సాధించారో వారిని రెండో సెమిస్టర్‌లోకి కొనసాగించేందుకు అనుమతిచ్చింది. మొత్తం 25 మంది విద్యార్ధుల్లో 10 మంది జీపీఏ స్కోరు 3.3, 3కు సమీపంలో ఉండటంతో వీరికి ఓకే చెప్పింది.
మిగతా 15 మంది విద్యార్ధులు జీపీఏ స్కోరు 1.3, 1.66గా ఉండటంతో కొందరికి ఇక్కడే తగిన కోర్సులో చేరేందుకు లేదా ఏదైనా వర్సిటీలో అడ్మిషన్‌కు సాయపడతామని సూచించింది. వీరిలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంకు చెందిన వారే కావడం విశేషం.
అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన తెలుగు విద్యార్ధులు చదువు దృష్టి పెట్టుకుండా పార్ట్ టైమ్ ఉద్యోగులను వెతుక్కుంటూ డబ్బు సంపాదించుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా చదువుపై దృష్టి కేంద్రీకరించకుండా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడం వల్ల వారి యొక్క అకడమిక్ కెరీర్ దెబ్బతింటోందని ఏజెన్సీలు అభిప్రాయపడతున్నాయి.
వెస్టర్న్ కెంటకీ యూనివర్శిటీ భారత స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆదిత్య శర్మ ఈ విషయంపై మాట్లాడుతూ చదువు కోసం ఇక్కడికి వచ్చిన చాలా మంది విద్యార్ధులు చదువుని సీరియస్‌గా తీసుకోవడం లేదని పేర్కొన్నారు. దీనివల్లనే ఎక్కువ మంది విద్యార్ధులను తిరిగి స్వదేశానికి పంపిస్తున్నారని తెలిపారు.
వాస్తవానికి హైదరాబాద్‌లోని ఏజెన్సీలు మాత్రం వెస్టర్న్ కెంటకీ యూనివర్శిటీని అత్యుత్తమ వర్సిటీగా అభివర్ణిస్తున్నారు. సెమిస్టర్‌కు కేవలం రూ. 5లక్షలు మాత్రమే ఫీజులు వసూలు చేస్తుందని తెలిపారు. అమెరికాలోని మిగతా సిటీలతో పోలిస్తే కెంటకీ పట్టణంలో జీవనం సాగించేందుకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువని తెలిపాయి.
ఈ ఏడాది జనవరిలో 60 మంది కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌లో చేరేందుకు పేర్లు నమో దు చేసుకున్నారు. మొదటి సెమిస్టర్‌పూర్తి కావస్తుండగా వారి లో 40 మంది అర్హులు కారని తేలినట్లు వర్సిటీ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ చైర్మన్ జేమ్స్ గ్యారీ తెలిపారు. సామర్థ్యం సాధించకుండా వీరు బయటకు వెళితే తమ వర్సిటీ పేరు పోతుందని, అందుకే బహిష్కరించామని చెప్పారు.












Click it and Unblock the Notifications