జగన్ ఎమ్మెల్యేల మాటేంటి: బాబుకు జగదీశ్వర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయలంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఓ సవాల్ విసిరారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. ఏపీలో ఇతర పార్టీల నుండి చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే తాము కూడా సిద్ధమన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాజీనామా చేయిస్తే, తెలంగాణలో టీడీపీ నుంచి తెరాసలో చేరిన వారితో రాజీనామాలు చేయించటానికి తమకు అభ్యంతరంలేదన్నారు. టీడీపీ నేతలను మేం కొంటే, వైసీపీ నేతలను చంద్రబాబు కొన్నారా అని ప్రశ్నించారు. ఎక్కడైనా ఒకే న్యాయం ఉండాలని, కానీ ఆంధ్రాలో అధికారంలో ఉన్న టీడీపీ ఏం చేస్తోందని ప్రశ్నించారు.

 What about YSRCP MLAs, who joined in TDP: Jagadeeswar Reddy to Chandrababu

అక్కడ ఇతర పార్టీలకు చెందిన ఎంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను టీడీపీలో చేర్చుకున్నదో తెలియదా అన్నారు. ముఖ్యమంత్రిగా తనను మించిన వాడులేడని ఆయన తనకు తానే జబ్బలు చర్చుకొని సర్టిఫికెట్‌ ఇచ్చుకోవడం నవ్వు తెప్పిస్తోందని అభిప్రాయపడ్డారు. కొనుగోళ్లు, మేనేజ్సమ్యానిపులేట్‌ చేయటం చంద్రబాబుకే తప్ప తమకు అలవాటు లేదన్నారు.

తెలంగాణ అభివృద్ధిపై లోగడ చంద్రబాబు విసిరిన సవాల్‌ను కేసీఆర్‌ స్వీకరించి అబిడ్స్‌ చౌరస్తాలో చర్చకు సిద్ధమని ప్రకటిస్తే, ఆయన నుంచి తిరిగి జవాబు రాలేదన్నారు. బాబు మాట, సవాలు పైన నిలబడే వ్యక్తి కాదన్నారు. రైతు ఆత్మహత్యలపై రాహుల్‌ గాంధీ తెలంగాణ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారనే వార్తలపై జగదీశ్‌ రెడ్డి స్పందించారు.

రాహుల్‌కి రైతు సమస్యలు తెలిస్తే, లోకసభలో కాంగ్రెస్‌కి ప్రతిపక్ష హోదా లేకుండా ఎందుకు పోతుందని, ఆయనకు రైతు సమస్యలు తెలుస్తాయని అనుకోవటం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ, బహిరంగ సభ వేదికలపై మొదటి వరుసలో మహిళలకు చోటు దక్కకపోవటం పెద్ద విషయం కాదన్నారు. వాళ్లు వేదికపై ఎక్కడ కూర్చున్నా ఒక్కటేనని చెప్పారు.

ఏపీలో మహానాడు పెడితే డ్వాక్రా మహిళలు కొడతారని మహానాడును తెలంగాణలో పెడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో మిగులు బడ్జెట్‌కు చంద్రబాబు కారణమైతే ఏపీలో ఎందుకు సాధించలేకపోతున్నారని ప్రశ్నించారు. తన దగ్గర కేసీఆర్ పని చేశారని చంద్రబాబు చెప్పడం విడ్డూరమన్నారు. 1983లో చంద్రబాబు ఏ పార్టీ నుండి వచ్చారో చెప్పాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+