బాబు మాటల వెనుక: పార్టీకి పూర్వవైభవం వచ్చేనా, వ్యూహమిదే!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి టిడిపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి ఏమిటనే చర్చ సాగుతోంది. అయితే పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుంది. ఈ తరుణంలో తెలంగాణ నేతలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హమీ ఇచ్చారు.

  Big Shock To Revanth Reddy రేవంత్‌కు బిగ్ షాక్ | Oneindia Telugu

  రేవంత్‌రెడ్డితో పాటు తెలంగాణకు చెందిన కీలక నేతలు టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఈ పరిణామంతో చంద్రబాబునాయుడు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలను ప్రారంభించారు.తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలతో గురువారం నాడు చంద్రబాబునాయుడు చర్చించారు.

  రాష్ట్ర జనరల్ బాడీ సమావేశంలో కార్యకర్తలను ఉత్సాహపర్చే విధంగా చంద్రబాబునాయుడు మాట్లాడారు. అంతేకాదు ఈ సమావేశంలో చంద్రబాబునాయుడు చేసిన కొన్ని నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు రానున్న రోజుల్లో టిడిపి అనుసరించే వ్యూహంపై ఉత్కంఠను కల్గిస్తున్నాయి.

   వ్యూహం వెల్లడించనన్న బాబు

  వ్యూహం వెల్లడించనన్న బాబు

  తెలంగాణ టిడిపి నేతల విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు ఉత్కంఠను కల్గిస్తున్నాయి.తమ వ్యూహం తమకు ఉందని చంద్రబాబునాయుడు ప్రకటించారు. అయితే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ఏ రకమైన వ్యూహన్ని అనుసరిస్తున్నామో ఇప్పుడే చెప్పలేనని బాబు నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ఉత్కంఠను రేకేత్తిస్తున్నాయి. రానున్న రోజుల్లో టిడిపి అధినేత అనుసరించే వ్యూహమేటనే ఆసక్తి నెలకొంది.

  పార్టీని వీడిన కీలక నేతలు

  పార్టీని వీడిన కీలక నేతలు

  తెలుగుదేశం పార్టీని కీలక నేతలు వీడి వెళ్ళారు. తెలంగాణ ఉద్యమం సమయంలో చాలా మంది నేతలు పార్టీని వీడారు. రేవంత్‌రె్డ్డి వెంట మరికొందరు నేతలు పార్టీని వీడారు. అయితే ఇంకా కొందరు నేతలు మాత్రమే పార్టీలో ఉన్నారు. అయితే గ్రామస్థాయిలో ఉన్న టిడిపి క్యాడర్‌ను టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే చాటా గ్రామాల్లో టిఆర్ఎస్‌ వైపుకు టిడిపి క్యాడర్ వెళ్ళింది. రేవంత్‌ వెంట వెళ్ళిన నేతలు కూడ కాంగ్రెస్ పార్టీలోకి టిడిపి క్యాడర్‌ను లాక్కొనే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ పరిస్థితులన్నింటిపై టిడిపి నాయకత్వం లోతుగా చర్చించింది.

   ఇతర పార్టీల్లో చోటు దక్కకనే

  ఇతర పార్టీల్లో చోటు దక్కకనే

  టిడిపిలో ఉన్న కొందరు నేతలు స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇతర పార్టీల్లోకి వెళ్తే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కకపోవడంతో పాటు ఆయా పార్టీల్లోని నేతలతో పొసగని కారణాలతో కొందరు నేతలు టిడిపిలోనే ఉన్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే మరికొందరు నేతలు మాత్రం సిద్దాంతం ఆధారంగానే తాము టిడిపిలోనే కొనసాగుతామని ప్రకటిస్తున్నారు.

  పూర్వ వైభవం వచ్చేనా

  పూర్వ వైభవం వచ్చేనా

  తెలంగాణలో టిడిపికి పూర్వ వైభవం వచ్చేనా అనే చర్చ ప్రస్తుతం రాజకీయవర్గాల్లో సాగుతోంది. అయితే తెలంగాణ టిడిపి నాయకత్వం మాత్రం పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకొంటున్నట్టు ప్రకటించింది. 2009 ఎన్నికల్లో టిడిపికి తెలంగాణలో సుమారు 35 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ, తెలంగాణ ఉద్యమం సమయంలో చోటుచేసుకొన్న పరిణామాల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్‌లో చేరారు. అయితే 2014 ఎన్నికల్లో తెలంగాణలో 15 మంది ఎమ్మెల్యేలు 1 ఎంపీ విజయం సాధించారు. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టిడిపి నుండి 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్‌లో చేరారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేవలం ఇద్దరు మాత్రమే ఎమ్మెల్యేలు టిడిపిలో ఉన్నారు. అయితే 2019 ఎన్నికల నాటికి టిడిపిలో కొత్త నాయకత్వాన్ని తీసుకువస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  What is the Chandrababu Naidu strategy to strengthen TDP in Telangana. Chandrababu naidu sensational comments on tdp strategy in Telangana party general body meeting held at Hyderabad on Thursday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి