వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెట్రో రైలు ఆలస్యానికి సీఎం కారణం, టిఆర్ఎస్ అంతు చూస్తాం: ఉత్తమ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వెళ్ళిన తమ పార్టీ నేతలను అడ్డుకోవడాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తప్పుబట్టారు.2019లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిఆర్ఎస్ అంతు చూస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు.

మెట్రో రైలు ప్రాజెక్టు తెలంగాణ ప్రజల సొత్తు అని ఉత్తమ్ చెప్పారు. ప్రాజెక్టు పనులు చూసేందుకు వెళ్లిన తమ నాయకులను పోలీసులు అడ్డుకోవటమేమిటని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. 2019 లో తమ సర్కార్ అధికారంలోకి వస్తుంది... అపుడు టీఆర్‌ఎస్‌ అంతు చూస్తామని హెచ్చరించారు. మెట్రోరైలు పనులు చూడ్డానికి పోలీసులకు అభ్యంతరం ఏమిటన్నారు. రూ.14 వేల కోట్లతో ప్రారంభమైన పనులు సీఎం కేసీఆర్ వైఖరితోనే ఆలస్యమయ్యాయన్నారు.

What is the reason to stop congress leaders metro rail project works asks Uttam kumar reddy

మూడేళ్లుగా పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని ఇందుకు కేసీఆర్‌, కేటీఆర్ లే కారణమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మెట్రో రైలు అలైన్‌మెంట్ మార్చాలనే కేసీఆర్ మొండిపట్టుదలతో ప్రజలపై మూడున్నర వేల కోట్ల రూపాయల అదనపు భారం పడిందని చెప్పారు. మెట్రోరైలు ప్రాజెక్టు పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు.

English summary
Tpcc president Uttam kumar Reddy made allegations on Tealangana cm Kcr and minister KTR on Wednesday. He asked that what is the reason to stop congress leaders near Metro rail works.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X