టిటిడిపి దారెటు: వెల్‌కం ఖాయమేనా, పొత్తులపై బాబు వ్యూహత్మక మౌనం?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: 2019 ఎన్నికల్లో టిడిపి ఏ పార్టీతో పొత్తు ఉంటుందనే విషయమై ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.టిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఏర్పాటయ్యే కూటమిలో చేరుతారా, ఒంటరిగా పోటీచేస్తారా, లేదా వామపక్షాలతో పొత్తు పెట్టుకొంటారా ఇప్పటికిప్పుడే తేలడం లేదు. మరో వైపు టిఆర్ఎస్‌తో 2019లో టిడిపి పొత్తు పెట్టుకొందనే విషయమై ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే రేవంత్‌రెడ్డి టిడిపిని వీడారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.మరోవైపు పొత్తుల విషయమై బాబు వ్యూహత్మకంగా మౌనం వహిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి

  Pamphlets Hulchul in West Godavari Over TDP leaders Corruptions టీడీపీలో 'కరపత్రం' అలజడి| Oneindia

  బాబు మాటల వెనుక: పార్టీకి పూర్వవైభవం వచ్చేనా, వ్యూహమిదే!

  తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి చెందిన కీలకనేతలు ఇప్పటికే పార్టీని వీడి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక.. స్థానిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో కొందరు నేతలు టిడిపిలోనే ఉన్నారు.

  రాజీనామాతో బాబుకు రేవంత్ షాక్: జగన్‌కు లాభమే, కెసిఆర్‌కు చిక్కులే

  తెలంగాణ పార్టీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటోంది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణ పార్టీ నేతలతో గురువారం నాడు విస్తృతస్థాయిసమావేశాన్ని నిర్వహించారు.

  టిఆర్ఎస్‌కు విజయరమణరావు షాక్: హమీ ఇచ్చినా కాంగ్రెస్‌లోకి, కారణమదేనా?

  టిడిపి పొత్తు ఎవరితో

  టిడిపి పొత్తు ఎవరితో

  2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టిడిపి పొత్తు ఏ పార్టీతో ఉంటుందనే విషయమై ప్రస్తుతం చర్చ సాగుతోంది. రాజకీయంగా తమ పార్టీని ఇబ్బందులకు గురిచేసిన టిఆర్ఎస్‌తో టిడిపి పొత్తు పెట్టుకొంటుందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. 2009 ఎన్నికల్లో టిడిపి, టిఆర్ఎస్‌ల మధ్య పొత్తు కుదిరిన విషయాన్ని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. తెలంగాణలో టిఆర్ఎస్... టిఆర్ఎస్ వ్యతిరేక కూటమిల మధ్య 2019 ఎన్నికల్లో పోటీ చేసుకొనే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో టిడిపి ఏ వైపుకు నిలిచే అవకాశం ఉందనేది మాత్రం ఇప్పటికిప్పుడే చెప్పలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే టిఆర్ఎస్‌తో పొత్తును తోసిపుచ్చలేమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

  టిడిపి ముందున్న అవకాశాలు

  టిడిపి ముందున్న అవకాశాలు

  తెలంగాణ రాష్ట్రంలో వామపక్షాలు, పవన్‌కళ్యాణ్, గద్దర్ కూటమిగా ఏర్పడి పోటీచేసే అవకాశం కన్పిస్తోంది. బిజెపి ఒంటరిగా పోటీచేయనున్నట్టు ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పార్టీతో టిడిపి పొత్తు పెట్టుకొనే అవకాశం లేదు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనను పార్టీలో కొందరు సీనియర్లు వ్యతిరేకించారు.కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడినందున ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకొంటామని టిడిపి సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే బావ సారూప్యత ఉన్న పార్టీలతో పొత్తుకు వామపక్షాలు సిద్దమని ఇప్పటికే ప్రకటించాయి.అయితే ఎన్నికల సమయంలో పొత్తుల విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు బిజెపితో పొత్తు పెట్టుకోవాలని టిడిపి నేతలకు ఉన్నప్పటికీ ఆ పార్టీ నేతలు మాత్రం టిడిపితో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. టిడిపితో పొత్తు వల్ల నష్టమేననే అభిప్రాయంతో బిజెపి నేతలు ఉన్నారు.అయితే బాబు వ్యూహత్మకంగా మౌనాన్ని వహిస్తున్నారని పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.

  టిడిపితో పొత్తు టిఆర్ఎస్‌కు ప్రయోజనమే

  టిడిపితో పొత్తు టిఆర్ఎస్‌కు ప్రయోజనమే

  టిడిపితో పొత్తు టిఆర్ఎస్‌కు కూడ ప్రయోజనమే అనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. జిహెచ్‌ఎంసి, రంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని సెటిలర్ల ఓట్లు కలిసివచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వెల్‌కం ప్రతిపాదనలో భాగంగా ఈ పొత్తు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని నిలువరించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

  పొత్తులపై నోరెత్తదన్న బాబు

  పొత్తులపై నోరెత్తదన్న బాబు


  2019 ఎన్నికల్లో తెలంగాణలో పొత్తుల విషయమై పార్టీ నేతలు ఎవరూ కూడ మాట్లాడకూదని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. పొత్తుల విషయమై తనకు వదిలేయాని తేల్చిచెప్పారు. ఎన్నికల సమయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై తనకు వదిలేయాని చంద్రబాబు తెలగాణ పార్టీ నేతలకు సూచించారు.అయితే 2019 ఎన్నికల్లో ఏపీలో బిజెపితో టిడిపి పొత్తు ఉంటుందా ఉండదా అనే విషయమై కూడ ఇంకా స్పష్టత రాలేదు. టిఆర్ఎస్ వ్యతిరేక కూటమితో టిడిపి జత కట్టే అవకాశం ఉందా అనేది కూడ ఇంకా తేలాల్సి ఉంది. అయితే ప్రస్తుతం టిడిపిలో ఉన్న నేతలు టిఆర్ఎస్‌తో పొత్తును కోరుకొంటున్నారని అంటున్నారు. అయితే వ్యూహత్మకంగానే ఈ ప్రచారాన్ని టిడిపి నేతలు తెరమీదికి తెచ్చారా అనేది కూడ తేలాల్సి ఉంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  What is the TTDp strategy in 2019 elections. Some TTDP leaders are intresting with alliance with TRs in 2019 . Chandrababu naidu ordered to party leaders nobody speak on alliance.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి