రేవంత్ చేసేది మూసీ లూటిఫికేషనే: పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో కేటీఆర్
మూసీ ప్రక్షాళనపై గురువారం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ అంటూ ఎద్దేవా చేశారు. మూసీని మురికి కూపంగా తాము మార్చలేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం ఏం చేసింది, ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసిందనేదానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
మూసీని మురికి కూపంగా మార్చిన పాపం కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలదేనని కేటీఆర్ అన్నారు. తాము ముసీని కరకట్టలతో కాపాడాలనుకున్నామని చెప్పారు. తాము రూ. 16,634 కోట్లతోనే మూసీ ప్రక్షాళనకు డీపీఆర్ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం రూ. లక్ష కోట్లంటూ ఢిల్లీకి మూటలు పంపేందుకే మూసీ ప్రాజెక్టుని తీసుకొచ్చిందని కేటీఆర్ ఆరోపించారు.

నిన్న సీఎం రేవంత్ రెడ్డి దాదాపు రెండున్నర గంటల పాటు తాను ఏదో విజ్ఞాన ప్రదర్శన చేస్తున్నానని అనుకుని తన సంపూర్ణమైన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చేయని సర్వేలను చేసినట్టు.. అబద్ధాలు, అర్ధ సత్యాలను అర్థంపర్థం లేని అసంబద్ద వాదనలను సంపూర్ణంగా బయపటెట్టి తన పరువు తానే తీసుకున్నారని కేటీఆర్ విమర్శించారు.
మూసీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి సర్వే జరగలేదు. మా ఇంటికి ఎవరు రాలేదు.. సర్వే జరగలేదని ప్రజలే చెబుతున్నారు. ఈయనేమో(రేవంత్ రెడ్డి) రెండు నెలల నుంచి సర్వే చేస్తున్నామని అబద్ధాలు ఆడుతున్నారు. ఇక జేసీబీలతో, కూలీలను పెట్టి ఇళ్లు కూలగొడుతున్నారు. ఇందుకు సాక్ష్యంగా సోషల్ మీడియాలో కూడా వీడియోలు వచ్చాయి. మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్లను కూలగొట్టేందుకు వచ్చిన ఓ కూలీ కూడా బాధపడ్డట్టు సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
సీఎం రేవంత్ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తున్న క్రమంలో గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. లక్షన్నర కోట్ల కుంభణానికి కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు.. దాన్ని సమాజం గమనిస్తుందన్నారు.
'మీరు ఆరు గ్యారెంటీలను అటకెక్కించారు. 420 హామీలతో ప్రజల గొంతు కోశారు. ముఖ్యమంత్రి మూసీ ప్రేమంతా.. ఢిల్లీకి పంపే మూటల కోసమే అని తేలిపోయింది' అని రేవంత్ సర్కారుపై కేటీఆర్ విమర్శించారు. మూసీ ప్రక్షాళనపై నల్గొండ మంత్రులు జ్ఞానం పెంచుకోవాలంటూ హితవు పలికారు.
-
Kavitha: తెలంగాణలో కవితకు పెరుగుతున్న క్రేజ్..కేటీఆర్‌ను దాటేస్తోందా..? -
KTR on Speaker Decision: దానం, కడియంకు క్లీన్ చిట్టా ? కేటీఆర్ షాకింగ్ ..! -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!!












Click it and Unblock the Notifications