జలవిహార్ లో కేటీఆర్ వాఖ్యల సారాంశం అదేనా..?
హైదరాబాద్: తెలంగాణ ఆపధ్దర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమారుడు, ఐటి శాఖ మంత్రి కేటిఆర్ జలవిహార్ లో సనత్ నగర్ నియోజక వర్గ కార్యకర్తల సమావేశంలో విచిత్ర వాదన వినిపించారు. ముందస్తు నిర్ణయం ఆయన తండ్రి కెసిఆర్ తీసుకున్నాడన్న విషయాన్ని కొద్ది సేపు కేటీఆర్ మరచిపోయి ఉపన్యాసం ఇచ్చినట్టు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చింది అధికార పార్టీయా లేక ప్రతిపక్ష పార్టీయా అన్ని ఇంగితం మరచిపోయి జలవిహార్ లో కేటిఆర్ ప్రసంగించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. కెసిఆర్ వ్యాఖ్యల పట్ల అధికార టీఆర్ ఎస్ పార్టీలోనే అయోమయాన్ని వ్యక్తం చేస్తున్నారు ముఖ్యనేతలు.

ఆశ్యర్యానికి గురి చేసిన కేటీఆర్ వాఖ్యలు..! పరిపాలించింది మూడేళ్లే అంటున్న కేటీఆర్..!!
జలవిహార్ లో ఐటి శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో దుమారాన్ని రేపుతున్నాయి. ఎప్పుడు పరిపక్వతగా మాట్లాడే కేటిఆర్ ముదస్తు ఎన్నికల పట్ల అవగాహన రాహిత్యంతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రతి అంశం పట్ల పూర్తి సమాచారాన్ని తెప్పించుకుని లోతుగా మాట్లాడే కేటిఆర్ ముందస్తు ఎన్నికల గురించి ఎందుకు ఆవిధంగా మాట్లాడారు అనే చర్చ సాగుతోంది. అసలు పాయింట్ పక్కన పెట్టి మిగతా విషయం అంతా మాట్లాడి టీఆర్ ఎస్ శ్రేణులను అయోమయానికి, ఆశ్చర్యానికి కెటిఆర్ గురి చేసారు కల్వకుంట్ల తారక రామారావు.

ముందస్తు కోరుకున్నది ఎవరు..? ఎన్నికలకు ఇప్పుడు సమయం సరిపోదని కేటీఆర్ వాఖ్య..!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాస్తవంగా ప్రభుత్వం పనిచేసింది 3 సంవత్సరాలు మాత్రమేనని మిగిలిన 2 సంవత్సరాలు వృధా అయ్యాయని కేటిఆర్ నర్మగర్బ వాఖ్యలు చేసారు. తెలంగాణ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటి 9 నెలలు విభజన చట్టంలోని హామీల అమలు కోసం, అధికారుల పంపకాలతో సరిపోయిందని చెప్పుకొచ్చారు. ఆతర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్ళి 9 నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేసారు.

విధ్యార్థుల పరీక్షలకు అదనపు టైం ఇస్తే.. ఫలితం బాగా వస్తుందన్న వ్యాఖ్యల అర్థం ఏంటి..?
పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్ధులకు మరింత సమయం ఇస్తే మరింత ఎక్కువ ప్రిపేర్ అయ్యే అవకాశం ఉండేదని అలా కాకుండా పరీక్షలను ముందస్తు నిర్వహిస్తే ప్రిపేర్ అవ్వడం కష్టమవుతుందని తెలంగాణ ముందస్తు ఎన్నికలను విశ్లేషించారు కేటీఆర్. అయితే ఇక్కడ ముందస్తు ఎన్నికలను కోరుకుంది, శాసనసభను రద్దు చేసింది తమ సొంత పార్టీ అన్న విషయాన్ని కేటీఆర్ విస్మరించారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడిలా ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడి గులాబి నాయకులను ఆశ్చర్యానికి గురిచేసారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయం పట్ల సందేహాన్ని వ్యక్తం చేసారు ఐటీ మంత్రి.

ముందస్తు పై కేటీఆర్ లో అసహనం..! సమయం సరిపోదన్న యువ మంత్రి..!!
తెలంగాణలో ముందస్తు ఎన్నికల గురించి కేటిఆర్ ఒక రకమైన నైరాశ్యంతో స్పందించారు. ఎన్నికలకు తాము సంసిద్దంగా లేనట్టు, ఎన్నికల ప్రిపరేషపన్ కు గడువు సరిపోదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. పరీక్షలు అనుకున్న గడువు కన్నా ఆలస్యంగా జరిగితే విద్యార్ధులు మరింత మెరుగ్గా పరీక్షలు రాసే వెసులుబాటు ఉంటుందని వ్యాఖ్యానించి ముందస్తు ఎన్నికలు తాము సిద్దంగా లేమని స్పష్టం చేసారు.. అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేసింది తన తండ్రి చంద్రశేఖరరావే అన్న సంగతిని కేటీఆర్ మరచిపోయారు.. చెప్పకనే ముందస్తు ఎన్నికలకు గులాబి పార్టీ సిద్దంగా లేదనే అంశాన్ని చెప్పేశారు కెటిఆర్. దీంతో కేటీఆర్ వ్యాఖ్యల సారాంశం ఏమైఉంటుందా అని సమావేశానికి హాజరైన కార్యక్తలు తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications