Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్‌కు రంజాన్ గిఫ్టు ఇదే! రాహుల్ గాంధీ ఏమంటారంటూ బండి సంజయ్

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు బీజేపీపై ఎంత నమ్మకం ఉందో మరోసారి ఈ ఎన్నికల్లో నిరూపించారని అన్నారు. కాంగ్రెస్ డబ్బులతో గెలవాలని చూసినా.. ప్రజలు మాత్రం బీజేపీ అభ్యర్థులనే గెలిపించారన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ మంచి విజయాలు సాధిస్తోందన్నారు.

కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో బండి సంజయ్ మాట్లాడారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. టీచర్స్, పట్టబద్రుల ఎమ్మెల్సీ రెండు ఎన్నికల్లోనూ విజయం సాధించామన్నారు.

What would Rahul say Ramzan gift to Congress Bandi Sanjay on BJP s victory in MLC elections

ప్రధాని నరేంద్ర మోడీ నిజాయితీ పాలనను ప్రజలంతా గుర్తించారన్నారు బండి సంజయ్. మోడీ పాలనా ప్రభావంతోనే విజయాలు సాధించగలుగుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్లలు, కుతంత్రాలు చేసినా.. ప్రపంచంలో భారత్ విజయం.. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్న విషయం ఈరోజు స్పష్టమైందన్నారు. డబ్బుల సంచులకు ధీటుగా ఓట్ల డబ్బాలు విజయం సాధించాయని బండి సంజయ్ అన్నారు.

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు కొన్నాళ్లుగా ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని.. ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ విజంయ సాధించిందని బండి సంజయ్ చెప్పారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి బీజేపీని ఓడించేందుకు కుట్రలు చేశాయని మండిపడ్డారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇక కౌంట్ డౌన్ మొదలైందన్నారు.

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటూ బీజేపీ వైపు చూస్తున్నారని బండి సంజయ్ అన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ భారీ విజయం సాధిస్తుందన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని ఆ పార్టీకి రంజాన్ గిఫ్టుగా ఇస్తున్నామన్నారు బండి సంజయ్.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హావా కొనసాగింది. రాష్ట్రంలో నిర్వహించిన కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి (Anji Reddy) ఘన విజయం సాధించారు. మూడు రోజులపాటు నిర్విరామంగా జరిగిన ఓట్ల లెక్కింపులో రెండో ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా అంజిరెడ్డి గెలుపొందారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయం కావడంతో నరేందర్ రెడ్డి ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో నిలిచారు.

మరోవైపు, కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు. టీచర్స్ కోటాలో మొత్తం 25,041 ఓట్లు ఉండగా.. అందులో 897 ఓట్లు చెల్లనివిగా తేలాయి. చెల్లుబాటైన 24,144 ఓట్లలో మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు దక్కాయి.

పీఆర్టీయూ అభ్యర్థి మహేందర్ రెడ్డి 7182 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 2621 ఓట్లతో మూడో స్థానంలో అశోక్ కుమార్ నిలిచారు. తెలంగాణలో మూడు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+