లేదంటే వెళ్లిపోండి: చుక్కలు చూపించారు, రిపోర్టర్లపై మహేష్ కత్తి తీవ్ర ఆగ్రహం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై నిత్యం విమర్శలు చేస్తూ హైప్ తెచ్చుకుంటున్న మహేష్ కత్తికి ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కొందరు రిపోర్టర్లు చుక్కలు చూపించారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అతను ఆగ్రహానికి లోనైన సందర్భాలు కూడా ఉన్నాయి.

  పవన్ మహేష్ మధ్యలో పూనమ్ కౌర్‌

  ప్రెస్ మీట్ సందర్భంగా మహేష్ కత్తి నటి పూనమ్ కౌర్ పైన అనుచిత ప్రశ్నలు సంధించారు. ఓ మహిళ పట్ల ఆయన వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. స్వయంగా ఆయన కూడా అన్నారు. తనకూ బాధగా ఉందని అంటూనే ప్రశ్నించారు.

  పూనమ్‌ను లాగి మరో తప్పు!: మహేష్ కత్తికి యాంకర్ దిమ్మతిరిగే షాక్, మీరెవరికి తెలుసు?

  మహిళను అవమానించిన మహేష్ కత్తి అంటూ విమర్శలు

  మహిళను అవమానించిన మహేష్ కత్తి అంటూ విమర్శలు

  ఇప్పటికే పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేయడంపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా చాలామంది కేవలం ఉద్దేశ్య పూర్వకంగానే ఈ మాటల దాడి జరుగుతున్నట్లుగా భావిస్తున్నారు. కానీ ఆదివారం పూనమ్ కౌర్‌ను ప్రశ్నించడం ద్వారా మహేష్ కత్తి ఓ మహిళను అవమానించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో స్వయంగా అతనిని ఇంటర్వ్యూ చేసిన ఆమె కూడా ఈ విషయాన్ని ప్రస్తావించింది.

  రెచ్చిపోతున్న మహేష్ కత్తి‌: వెనుక బలమైన శక్తి, పవన్ కళ్యాణ్‌పై ప్లాన్‌తో రంగంలోకి?

  రిపోర్టర్ల ప్రశ్నలకు మహేష్ కత్తి ఉక్కిరిబిక్కిరి

  రిపోర్టర్ల ప్రశ్నలకు మహేష్ కత్తి ఉక్కిరిబిక్కిరి

  ఇదిలా ఉండగా, ప్రెస్ మీట్ సమయంలో రిపోర్టర్ల ప్రశ్నలకు మహేష్ కత్తి ఉక్కిరి బిక్కిరి అయ్యారని అంటున్నారు. ఉదయం పదకొండు గంటలకు ఆయన ప్రెస్ క్లబ్ చేరుకున్నారు. పది నిమిషాల పాటు పవన్, పూనమ్ కౌర్‌ల కోసే వేచి చూశారు. ఈ సమయంలో మహేష్ కత్తిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు.

  అసలు మీరు పవన్‌ను ఎలా ప్రశ్నిస్తారు

  అసలు మీరు పవన్‌ను ఎలా ప్రశ్నిస్తారు

  సోషల్ మీడియా వేదికగా ఎవరో చేసిన కామెంట్లకు మీరు పవన్ కళ్యాణ్‌ను ఎలా నిందిస్తారని, మీరు సంధిస్తున్న ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఎలా సమాధానం చెబుతారని రిపోర్టర్లు నిలదీశారు. కానీ వారి ప్రశ్నలకు ఆయన స్పందించలేదు.

  రిపోర్టర్లపై మహేష్ కత్తి విసుగు

  రిపోర్టర్లపై మహేష్ కత్తి విసుగు

  అయిదు నిమిషాలు ఆగితే అన్నింటికి సమాధానం దొరుకుందని, మీరు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానని మహేష్ కత్తి అన్నారు. కానీ ఆ తర్వాత మాత్రం వాటికి సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. దీంతో రిపోర్టర్లు సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.దీంతో ఇష్టమున్న వాళ్లు ఉండండి... లేదంటే వెళ్లిపోండని మహేష్ కత్తి వారిపై విసుగుతో మండిపడ్డారని తెలుస్తోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Mahesh Kathi who is known for making controversial statements against stars, is facing the wrath of Pawan Kalyan fans. He recently criticised Pawan Kalyan and his political intentions which didn't go well with the Power Star's fans.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి