కవిత రాజకీయ పయనం ఎటువైపు..? జనాన్ని 'కల్వకుంట' ఎన్నిరోజులు..??
హైదరాబాద్ : బంగారు తెలంగాణ బతుకమ్మ.. జాగృతితో యావత్తు తెలంగాణ మహిళలు మేలుకొలిపిన ఆణిముత్యం. పార్లమెంట్ సభ్యురాలిగా ఆమె ప్రస్థానం నిరుపమానం. ఇదంతా తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కూతురు కల్వకుంట్ల కవిత గురించి గులాబీ శ్రేణులు నిన్నటి వరకూ చెప్పిన మాటలు. మరి ఇప్పుడు.. ఎందుకో క్యాడర్ మొత్తం కవిత అంశంలో నిస్తేజంగా మారిపోయింది. నిజామాబాద్ ఎంపీగా ఓటమి చవిచూసిన కవిత భవిష్యత్ రాజకీయాలపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ముందస్తు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగినా కనీసం మంత్రి పదవి దక్కేదంటూ కవిత అనుచరులు తెగ ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడైనా కవితను ఎమ్మెల్సీ చేసి మంత్రి వర్గంలో తీసుకుంటారా లేక ఉప ఎన్నికల్లో పోటీ చేయించి అసెంబ్లీలో ప్రవేశం కల్పిస్తారా అనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. ఇంతకి రాజకీయాల్లో కవిత కు దారేది..!!

కవిత మౌనం వీడాలి..! రాజకీయాల్లోకి రావాలంటున్న పార్టీ శ్రేణులు..!!
సరే జరిగిందేదో జరిగింది.. ఇప్పుడేం చేద్దామంటే ఏ దారి కనిపించట్లేదట. నల్లగొండ, హుజూర్‌నగర్ సీట్లు ఖాళీ అయ్యాయి. కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ లోక్‌సభకు ఎంపిక కావటంతో ఆ రెండుచోట్ల ఖాళీలు ఏర్పడ్డాయి. నల్లగొండలో పాగా వేయాలని భావిస్తున్న గులాబీ పార్టీ ఇప్పుడు ఆ రెండు సీట్లు గెలుచుకుని, లోక్‌సభ ఎన్నికల్లో పోయిన పరువును దక్కించుకోవాలని చూస్తున్నాయి. అయితే అక్కడ కాంగ్రెస్ పోటీ చేస్తుందా లేదా అనే అనుమానాలున్నాయి. ఒకవేళ హస్తం అభ్యర్థులు రంగంలోకి దిగితే గులాబీపార్టీ నుంచి ఎవర్ని నిలపాలనేది చంద్రశేఖర్ రావుకు పెద్ద సవాల్ గా మారింది.

పోటీ చేయాలంటున్న గులాబీ ఫాన్స్..!!
ఉప పోరులో కవిత..! పోటీ చేయాలంటున్న గులాబీ ఫాన్స్..!!
హుజూర్ నగర్ కు త్వరలో ఉప ఎన్నిక రాబోతుంది.. ఎమ్మెల్యే గా ఉన్న ఉత్తమ్ ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటుకు పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే.! దాంతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటివరకు ఉత్తమ్ ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు పర్యాయాలు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వస్తున్నారు. తాజాగా ఏంపీగా ఎన్నిక కావటంతో ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉండటంతో పలువురు ఆశావహులు ఈ నియోజకవర్గం నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకంటే ముందస్తు ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో, స్థానిక పోరులో నెగ్గిన చంద్రశేఖర్ రావు ఇదే ఊపుతో ఆ రెండు కాంగ్రెస్ స్థానాలను కూడా గెలిచి హస్తం హవాకు గండికొట్టాలని చూస్తున్నారు.

కవిత అంశంలో కేసీఆర్ నిశ్వబ్దం..! అదికూడా వ్యూహాత్మకమే అంటున్న నేతలు..!!
అందుకే.. నల్లగొండ, హుజూర్‌నగర్‌ల్లో ఏదోక స్థానం నుంచి కవితను రంగంలోకి దింపి ఎమ్మెల్యేగా అసెంబ్లీకు పంపాలని ఆశపడుతున్నారట. జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మరో అడుగు ముందుకేసి. కవిత కోసం తాను రాజీనామా చేసేందుకు సిద్ధమంటూ ప్రకటించాడు. కవిత పోటీ చేసేందుకు వీలుగా తాను రాజీనామాకు రెడీ అంటున్నాడు. ఇటువంటి సందిగ్థ సమయంలో గులాబీలోని సీనియర్లు.. కవితను ఎమ్మెల్సీ చేయటం ద్వారా సమాధానం చెప్పవచ్చంటున్నారట. అయితే కవిత మాత్రం.. తన నిర్ణయం ఏమిటనేది మాత్రం బయటపెట్టలేదు. అసలు రాజకీయాల్లో కొనసాగుతారా! జాగృతి సంస్థ ద్వారా కార్యక్రమాలు చేపడతారా! అనేది కూడా చెప్పలేదు. ఈ లెక్కన.. తాను రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని ఆశపడుతున్నమాటేనంటూ ఆమె మనసులో మాటను, గులాబీ శ్రేణులు పసిగట్టడం విశేషమే.

హుజుర్ నగర్ ఉప ఎన్నిక భరిలో పటేల్ రమేష్ రెడ్డి..! కవితకు ఎంతవరకు పోటీ..?
ఇటీవల వరకు ఉత్తమ్ సతీమణి పద్మావతి ఉప ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరిగింది..కానీ ఆర్థిక కారణాల రీత్యా ఆమె విముఖత చూపుతున్నట్లు సమాచారం.. దాంతో పటేల్ రమేష్ రెడ్డిని రంగంలో దించుతున్నట్లు సమాచారం. పటేల్ రమేష్ రెడ్డి కూడా ఇక్కడ పోటీ చేయటానికి ఆసక్తి చూపుతున్నారు..గత అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట సీటు ఆశించి భంగపడిన రమేష్ రెడ్డికి అధిష్టానం నల్గొండ లోక్ సభ సీటు ఇస్తామని హామీ ఇచ్చారు..కానీ ఆ ఎన్నికల్లో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వటం వలన మరోసారి రమేష్ కు నిరాశే ఎదురైంది..ఈ హుజూర్ నగర్ అసెంబ్లీ సీటు ఇచ్చే విషయంపై రమేష్ కు అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది..రేవంత్ రెడ్డికి అత్యంత సన్నహితునిగా ఉండటంతో హుజుర్ నగర్ సీటు కూడా ఆయనతోనే లాబియింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications