జూబ్లీహిల్స్ లో టీడీపీ సపోర్టర్స్ ఓట్లు వారికే, అక్కడే అసలు ట్విస్ట్..!!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు హోరా హోరీగా మారుతోంది. మూడు ప్రధాన పార్టీలు గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సీఎం రేవంత్ ఎలాగైనా ఈ సీటు గెలిచేందుకు మంత్రులను బరి లోకి దించారు. తానే స్వయంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతీ వర్గం ఓట్లు కీలకం అవుతున్నాయి. దీంతో, సామాజిక వర్గాల వారీగా ఆకట్టుకునేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో టీడీపీ.. జనసేన సానుభూతి పరులు ఉన్నారు. వీరి మద్దతు ఎవరికి అనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. ఫలితంలో వీరి నిర్ణయం కీలక భూమిక పోషించనుంది.

జూబ్లీహిల్స్ లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారాయి. ప్రధాన పార్టీలు వర్గాల వారీగా ఓటర్ల ను ఆకట్టుకునేందుకు అన్ని వర్గాల నేతలను ప్రచారంలోకి దించాయి. సామాజిక వర్గాల వారీగా ఓటర్ల వద్దకు నేతలు వెళ్తున్నారు. మద్దతు కోరుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవటంతో.. రేవంత్ కోసం ఆ పార్టీ సానుభూతి పరులు కాంగ్రెస్ కు అండగా నిలిచారు. ఇక, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో టీడీపీ సానుభూతి పరుల సంఖ్య ఎక్కువగానే ఉంది. టీడీపీ ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. అయితే.. ఎక్కడా పార్టీ అధికారికంగా బీజేపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం వెల్లడించ లేదు. పవన్ మాత్రం బీజేపీ అభ్యర్ధికి మద్దతుగా ప్రచారానికి వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక్కడ సెటిలర్లు..సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా అధికంగా ఉండటంతో వీరి ఓట్ల కోసం మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

Which party get support of TDP Sympathizers in Jubilee hills by poll here the details

టీడీపీ సానుభూతి పరులో పాటుగా కమ్మ వర్గానికి చెందిన ఓటర్లు తమకే మద్దతు ఇస్తారని బీజేపీ భావిస్తోంది. అయితే.. రేవంత్ తో ఇప్పటికే కమ్మ వర్గానికి చెందిన పెద్దలు సమావేశం అయ్యారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ కే మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. మైత్రీవనం వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరగా.. సీఎం రేవంత్ అంగీకరించారు. ఇక.. మాగంటి గోపినాథ్‌ రాజకీయ ప్రస్థానం టీడీపీలోనే స్టార్ట్ అయింది. ఆయన ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీలో పనిచేశారు. తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన గోపినాథ్‌..మొదటిసారి 2014లో టీడీపీ ఎమ్మెల్యేగానే గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్‌లో చేరి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరినప్పటికీ..టీడీపీ సానుభూతిపరులు, కమ్మ ఓటర్లు మాగంటి గోపినాథ్‌కు ఆయన వెంటే నడిచారు.

ఇప్పుడు అదే మద్దతు తమకు ఉంటుందని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారు. కమ్మ వర్గానికి దాదాపు 22 వేల ఓట్లు ఉన్నాయి. ఇటు రేవంత్ తో భేటీ తరువాత కమ్మ వర్గం పూర్తిగా కాంగ్రెస్ కే మద్దతుగా నిలుస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ తరఫున కమ్మ నేతలతో టచ్‌లోకి వెళ్లారు. వారి మద్దతు కోసం మంతనాలు చేస్తున్నారు. అయితే కమ్మ నేతలంతా సీఎం రేవంత్‌ను కలవడంతో..బీఆర్‌ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. తమ పార్టీకి చెందిన కమ్మ వర్గ నాయకులను రంగంలోకి దింపారు. కాగా.. కమ్మ వర్గం మెజార్టీ ఓటింగ్ కాంగ్రెస్ కే ఉంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎన్డీఏ లో భాగస్వామిగా ఉన్నా.. ఏపీకే పరిమితమనే విశ్లేషణలు మొదలయ్యాయి. దీంతో.. ఇప్పుడు టీడీపీ మద్దతు దారుల ఓటింగ్ ఎవరి వైపు నిలుస్తుందీ.. ఎవరు ఎటు మద్దతు ఇచ్చారనేది 14న వెల్లడి కానున్న ఫలితాల్లో తేలిపోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+