కేటీఆర్‌కు పాత శాఖ.. హరీష్ రావుకు ఏ శాఖ... ?
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మరి కాసేపట్లో విస్తరించనున్న నేపథ్యంలోనే కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై కసరత్తు కొనసాగుతున్నట్టు సమాచారం. దీంతో ఎవరికి ఏయో శాఖలు కేటాయిస్తారనే ఉత్కంఠ నెలకొంది. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వారికి శాఖలను కేటాయించనన్నారు. అయితే ప్రస్తుత కేబినెట్ విస్తరణలో ముగ్గురు మాజీ మంత్రులు ఉండగా మొదటి సారి మంత్రి భాద్యతలు చేపట్టేవారు ముగ్గురు ఉన్నారు.

ఆరుగురు కొత్త మంత్రులు
మొత్తం మీద టీఆర్ఎస్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వతా ఆరు నెలలకు కేబినెట్ విస్తరణ జరగనుంది. విస్తరణకు సంబంధించి ముహుర్తం ఫిక్స్ అయింది. సాయంత్రం నాలుగు గంటలకు నూతన గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహాక అధ్యక్షుడు కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీష్ రావులతోపాటు మాజీ మంత్రి ఇటివల టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్,పువ్వాడ అజయ్, గంగుల కమాలాకర్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కేటీఆర్‌కు పాత శాఖ..హరీష్‌కు నీటీపారుదల లేదా ఆర్ధిక శాఖ
అయితే విస్తరణలో భాగంగానే ప్రమాణస్వీకారం చేయనున్న వారిలో ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మాజీ మంత్రి కేటీఆర్‌కు తిరిగి మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్‌తో పాటు ఐటీ శాఖలను కేటాయించనున్నట్టు సమాచారం. సాగునీటీ రంగానికి ఈ సంవత్సరం కూడ అధికప్రాధాన్యత ఇవ్వనున్న నేపథ్యంలోనే గతంలో భారీ,మరియు చిన్న నీటీ పారుదల శాఖను నిర్వహించిన హరీష్‌కు తిరిగి అదే స్థానాన్ని కేటాయిస్తారా లేదా అనే తేలాల్సి ఉంది. మరోవైపు ఆయనకు ఆర్ధిక శాఖను కేటాయిస్తారనే ప్రచారం కూడ కొనసాగుతోంది. ఇక తన శాఖపై ఆసంతృప్తిగా ఉన్నమంత్రి ఈటల రాజెందర్‌ను ఇతర శాఖను కేటాయించి, కొత్తగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కు వైద్యశాఖను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఇక గంగుల కమలాకర్‌కు ఏ శాఖను కేటాయిస్తారనే సమాచారం మాత్రం అందడం లేదు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు ఏశాఖను కేటాయిస్తారో వేచి చూడాలి.

హొంమంత్రి సబితా ఇంద్రారెడ్డి...?
ఇక గతంలో హోంమంత్రిత్వశాఖను నిర్వహించిన సబితా ఇంద్రారెడ్డికి హోంశాఖను కేటాయించనున్నట్టు సమాచారం. కాగా ఇప్పటి వరకు హోంమంత్రిగా భాద్యతలు స్వీకరిస్తున్న మహమ్ముద్ ఆలీకి మైనారీటీ సంక్షేమ శాఖను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మైనారిటీ సంక్షేమ శాఖను మంత్రి కొప్పుల ఈశ్వర్ బీసీ సంక్షేమంతో పాటు మైనారీటీ సంక్షేమ శాఖను నిర్వహిస్తున్నారు.దీంతోపాటు మొదటి సారిగా మంత్రి భాద్యతలు చేపడుతున్న సత్యవతి రాథోడ్ మహిళ సంక్షేమశాఖను అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కార్మిక శాఖతో పాటు మహిళ సంక్షేమ శాఖను మంత్రి మల్లారెడ్డి నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications