వరంగల్‌లో జగన్ పార్టీ పోటీ: ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం?
హైదరాబాద్: వరంగల్ లోకసభ స్థానంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిని దించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ పార్టీ పోటీ చేస్తుందని కూడా ఎవరూ భావించలేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన అభ్యర్థిగా నల్ల సూర్యప్రకాష్‌ను పోటీకి దించడమే కాకుండా తాము గెలిచి తీరుతామని పార్టీ తెలంగాణ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు.
అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీ వల్ల వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల సమరంలో ఎవరి ఓట్లకు గండిప డుతుందనే విషయంపై చర్చ నడుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఖమ్మం జిల్లాలోనే కాస్తా ప్రభావం చూపింది. ఒక ఎంపీ సీటు, మూడు ఎమ్మెల్యే స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకొన్నా వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే టిఆర్ఎస్ సరసన చేరారు.
టిఆర్ఎస్, టి కాంగ్రెస్, బిజెపి టిడిపి కూటమి ఓట్లలో ఎవరి ఓట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలుస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగతోంది. ఈ విషయమై తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువగా అంతర్మ థనం సాగుతున్నట్లు సమాచారం. ఈ బహుముఖ పోటీ వల్ల తమ పార్టీకి వాటిల్లే నష్టం ఏమిటీ, వాటిని ఎలా ఎదు ర్కోవాలి అన్న దిశగా కూడా తెలంగాణ కాంగ్రెస్‌లో సమాచలోచనలు కొనసాగుతున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పోటీని అధికార టిఆర్ఎస్ మాత్రం ఏ మాత్రం లెక్కలోకి తీసుకోవడం లేదని సమాచారం. అయితే ఆ పార్టీ ప్రోద్భ లం వల్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగిందన్న విమర్శలు తెలంగాణలోని ఇతర ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. వ్యతిరేక ఓట్ల చీల్చి తాను లాభపడేందుకే టిఆర్ఎస్ అంత ర్గతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బరిలో నిలబడేందుకు ప్రోత్సహిస్తోందనే అభిప్రాయం బలంగా ఉంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వల్ల తమకు నష్టం జరగకపోగా మేలే జరుగుతుందన్న ధీమాను సైతం టిడిపి, బిజెపి కూటమి వ్యక్తపరుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్న బలం ఏ పాటిది, ఆ పార్టీ ముఖ్యంగా ఎవరి ఓటు బ్యాంకును చీల్చుతుంది అన్నది కూడా ఆసక్తిగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి, ఆయన సోదరి షర్మిళ వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

Click it and Unblock the Notifications