Telangana: ప్రతిపక్ష నేత ఎవరు..! కేసీఆరా.. కేటీఆరా.. లేక హరీశ్ రావా..!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అయితే ప్రధాన ప్రతి పక్షం ఎవరో కూడా తేలిపోయింది. అయితే విపక్ష నేతగా ఎవరు ఉంటారనేదే ప్రశ్నగా మారింది. బీఆర్ఎస్ కేసీఆర్ అసెంబ్లీ వచ్చి ప్రతిపక్ష నేత వ్యవహరించే పరిస్థితి కనిపించడం లేదు. కేసీఆర్ కాకుండా మిగిలింది హరీశ్ రావు, కేటీఆర్. కేటీఆర్ ముఖ్యమంత్రి గతంలో ప్రొజెక్ట్ కావడం వల్ల.. ఇప్పుడు ఆయన ప్రధాన ప్రతిపక్షనేతగా వ్యవహరించే అవకాశం ఉంది.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఈటల రాజేందర్ వ్యవహరించారు. కానీ అధికారంలోకి రాగానే కేసీఆర్ సీఎం అయ్యారు. ఈ లెక్కన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడిగా ఉన్న కడియం శ్రీహరి ప్రతిపక్ష నేత ఎంపిక చేసే అవకాశం కూడా ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కొత్త గెలిచిన ఎమ్మెల్యేలతో.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణల భవన్ లో సోమవారం సమావేశం అయ్యారు.

 Who is going to be the Leader of Opposition from BRS?

గెలుపోటములపై సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణం.. చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారు. అక్కడ కేసీఆర్ తో సమావేశమయ్యారు. ప్రధాన ప్రతి పక్ష నేతగా కేటీఆర్ నే ఎంపిక చేయాలని ఎమ్మెల్యే నుంచి ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.

బీఆర్ఎస్ 39 స్థానాలు గెలుచుకోగా.. బీజేపీ 8 చోట్ల, ఎంఐఎం 7 స్థానాలు, సీపీఐ ఒక సీటు గెలుచుకుంది. ఈసారి బీజేపీకి 7 సీట్లు అదనంగా వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+