"ముఖ్య" నేతలకు భారీ షాక్ - ఓటర్ల తీర్పుతో విలవిల..!!
తెలంగాణ ఓటర్లు తమ పవర్ ఏంటో చూపించారు. తిరుగులేదని భావించిన ముఖ్య నేతలకే చెమటలు పట్టించారు. ఎక్కడ పోటీ చేసినా గెలుపు తమదేననే ధీమాతో కనిపించిన నేతలు సైతం టెన్షన్ తప్పటం లేదు. తెలంగాణలో పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. అధికారం ఎవరదనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కానీ, ఈ ఎన్నికల్లో తమ స్థానాల్లో కాకుండా వేరే చోట పోటీ చేసిన నేతలకు ఓటర్లు గట్టి షాక్ ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది.
నువ్వా నేనా
తెలంగాణలో ఎన్నికల పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. ప్రధాన పార్టీల అధ్యక్షులు, ప్రముఖులు పోటీ చేసిన స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓటర్లు ఈ సారి అన్ని పార్టీల ముఖ్య నేతలకు తమదైన తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు ఊహించని ముఖ్య నేతల్లో టెన్షన్ మొదలైంది. సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తలపడిన కామారెడ్డిలో 74.86% ఓట్లు పోలయ్యాయి.

ఇక్కడ అభ్యర్థుల గెలుపుపై భారీ బెట్టింగ్ లు జరుగుతన్నాయని సమాచారం. ఇక్కడ కేసీఆర్ - రేవంత్ మధ్య సాగిన హోరా హోరీ పోరులో బీజేపీ లాభపడుతుందనే చర్చ మొదలైంది. అదే సమయంలో ముగ్గురులో ఎవరు గెలిచినా అతి స్వల్ప మెజార్టీనే ఉంటుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
ఓటర్లు ఊహించని దెబ్బ
ఇక, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిటింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నడుమ అత్యంత ఆసక్తి రేపిన పాలేరులో రికార్డు స్థాయిలో 90.28% ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ తమ్మినేని కేంద్రంగా గెలుపు ఓటుమలు ప్రభావితం అవుతున్నట్లు సర్వేలు అంచనా వేసాయి.
కేసీఆర్, బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ పోటీపడిన గజ్వేల్‌లో 80.32% పోలింగ్ నమోదైంది. సర్వే సంస్థల లెక్కల ప్రకారం కేసీఆర్ కు గెలుపు అవకాశం కనిపిస్తోంది. రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్‌లో 80.90 శాతం మంది ఓటేశారు. ఇక్కడ రేవంత్ ఓడిపోతున్నారని తొలి నుంచి బీఆర్ఎస్ ప్రచారం చేసింది. కానీ, రేవంత్ వైపే ఓటర్లు మొగ్గు చూపించినట్లు సర్వే నివేదికలు తేల్చుతున్నాయి.
గెలిచేదెవరు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, మంత్రి గంగుల కమలాకర్ ఢీ అంటే ఢీ అని తలపడిన కరీంనగర్‌లో 64.17% పోలింగ నమోదైంది. ఇక్కడ చివరి వరకు ఇక్కడ హోరా హోర పోరు కొనసాగింది. ఇద్దరిలో ఎవరు గెలిచినా మెజార్టీ స్వల్పంగా ఉంటుందని చెబుతున్నారు. అదే విధంగా హుజూరాబాద్ 86.31 శాతం పోలింగ్ నమోదైంది.
అక్కడ గట్టి పోటీ జరిగినట్లు పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది. ఈటలకు వ్యక్తిగతంగా ఉన్న పట్టు..అండర్ కరెంట్ చివరకు గెలిపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సిర్పూర్‌లో 81.16 శాతం ఓటింగ్ జరగటంతో అక్కడ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కు గెలుపు అవకాశాలు ఉన్నాయని సర్వే సంస్థలు చెబుతున్నాయి. దీంతో, తుది ఫలితాల పైన మరింత ఉత్కంఠ పెరుగుతోంది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications