హంగ్ వస్తే తెలంగాణ సీఎం ఎవరు - అనూహ్య కలయిక, మంత్రాంగం షురూ..!!
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ పెరుగుతోంది. మెజార్టీ సర్వే సంస్థలు కాంగ్రెస్ కు పట్టం కట్టినా..బీఆర్ఎస్ ఈ సర్వే అంచనాలతో ఏకీభవించటం లేదు. పోలింగ్ శాతం గతం కంటే తగ్గటంతో కాంగ్రెస్ కూడా చివరి నిమిషంలో అలర్ట్ అవుతోంది. ఇదే సమయంలో బీజేపీ కి వచ్చే సీట్లు కీలకం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో హంగ్ వస్తే ఎవరు ఎవరికి మద్దతిస్తారు. సీఎం అయ్యేది ఎవరు. తెర వెనుక ఎలాంటి రాజకీయం మొదలైంది. లెక్కలు..ఎత్తులు మొదలయ్యాయి.
అధికారం ఎవరిది
తెలంగాణ ఎన్నికల్లొ హోరా హోరీ పోరు జరిగింది. అధికారం పైన బీఆర్ఎస్, కాంగ్రెస్ చివరి నిమిషం వరకు ధీమా వ్యక్తం చేసాయి. కానీ, మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కే మద్దతుగా నిలిచాయి. కొన్ని బీఆర్ఎస్ కు ఛాన్స్ ఉందని అంచనా వేయగా..మరి కొన్ని హంగ్ సంకేతాలు ఇచ్చాయి. పోలింగ్ పూర్తి కాకుండా ఎగ్జిట్ పోల్స్ రావటం..రాత్రి వరకు పోలింగ్ జరగటం..గతం కంటే పోలింగ్ శాతం తగ్గటంతో ఇప్పుడు తెలంగాణలో హంగ్ అవకాశాలపై చర్చ మొదలైంది.

బీజేపీకి వస్తాయని ఎగ్జిట్ పోల్స్ లో అంచనా వేస్తున్న సీట్లు డిసైడిండ్ ఫ్యాక్టర్ గా మారుతున్నాయి. దీంతో, గెలుస్తామని చెబుతున్న కాంగ్రెస్... తమకే ఇంకా ఛాన్స్ ఉందని చెబుతున్న కాంగ్రెస్ కొత్త ఎత్తులతో సిద్దం అవుతున్నాయి. కీలక మంత్రాంగా ప్రారంభించాయి.
హంగ్ వస్తే సీఎం ఎవరు
తెలంగాణలో హంగ్ దిశగా అవకాశం ఉందని తుది పోలింగ్ శాతం తరువాత చర్చ మొదలైంది. సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ 56, బీఆర్ఎస్ 48 సీట్లు సాధిస్తుంది. అదే సమయంలో బీజేపీ 10, ఎంఐఎం 6 సీట్లు దక్కించుకొనే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కించుకోవటానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ లో ఎవరికి వచ్చినా వాళ్లదే అధికారం.
కానీ, మ్యాజిక్ ఫిగర్ కు కొద్దిగా దూరంగా ఏ పార్టీ నిలిచినా..తెలంగాణ రాజకీయం కొత్త టర్న్ తీసుకోవటం ఖాయం. అధిక స్థానాలు సాధించిన పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అవకాశం ఇస్తారు. ఆ సమయంలో పార్టీ తమకు ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్య నిరూపించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచే మరో పార్టీ కనిపించటం లేదు.

ఎవరితో ఎవరు కలుస్తారు
కాంగ్రెస్ కు అంచనా వేస్తున్నట్లుగా 60 లోపు సీట్లు వస్తే రాజకీయం మారటం ఖాయం. బీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు ఖాయమనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఇప్పుడు ఎంఐఎం కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే బీఆర్ఎస్ మద్దతు అవసరమైతే ఎంఐఎం, బీజేపీలో ఇద్దరి నుంచి మద్దతు కోరే అవకాశం ఉంటుంది. కానీ, ఎంఐఎం, బీజేపీ రెండు పార్టీలు ఒకే కూటమిలో ఉండే అవకాశం ఉండదు.
దీంతో, బీజేపీ బయట నుంచి బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ - బీజేపీ రెండు పార్టీల లక్ష్యం కాంగ్రెస్ కావటంతో బీజేపీ మద్దతు పైన చర్చ కొనసాగుతోంది. ఎంఐఎం నేరుగా మద్దతు ఇవ్వకపోయినా..పరోక్షంగా సహకరించే ఛాన్స్ ఉందనే వాదన ఉంది. దీంతో, ఈ నెల 3న వెల్లడయ్యే తుది ఫలితాల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోయినా..తెలంగాణ రాజకీయం మరింత ఉత్కంఠ పెంచటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications