వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనం: 'ప్రభాకర్ రెడ్డిది హత్యే, పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు'?.

బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసులో పోలీసుల విచారణ పట్ల ఆత్మహత్య చేసుకొన్న కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సతీమణి రచన అనుమానాలను వ్యక్తం చేశారు. ప్రభాకర్ రెడ్డి చనిపోయినందున శిరీష ఆత్మహత్య కేసులో ఆ

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఆలేరు: బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసులో పోలీసుల విచారణ పట్ల ఆత్మహత్య చేసుకొన్న కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సతీమణి రచన అనుమానాలను వ్యక్తం చేశారు. ప్రభాకర్ రెడ్డి చనిపోయినందున శిరీష ఆత్మహత్య కేసులో ఆయనపై బురదచల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

కుకునూర్ పల్లిలో ఎస్ఐ ఆత్మహత్య చేసుకొన్న రోజు చోటుచేసుకొన్న విధ్వంసానికి సంబంధించి పోలీసులు నిందితులను ఎలా అరెస్టు చేశారని ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు.

ప్రభాకర్ రెడ్డిది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆందోళన చేసినవారిని ఎలా అరెస్టుచేశారని కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తును వారు తప్పుబడుతున్నారు. కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సిసిటీవి పుటేజీ ఎందుకు ఓపెన్ కావడం లేదని ఆమె ప్రశ్నించారు.

బ్యూటీషీయన్ శిరీష, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యల కేసుల విషయాలపై ఈ రెండు కుటుంబాల సభ్యులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కేసుల విషయాల్లో అనుమానాలుంటే నివృత్తి చేస్తామని పోలీసులు ప్రకటించారు.

ప్రభాకర్ రెడ్డిపై బురదచల్లే ప్రయత్నం

ప్రభాకర్ రెడ్డిపై బురదచల్లే ప్రయత్నం

బ్యూటీషీయన్ శిరీష కేసులో పోలీసుల దర్యాప్తు తీరుపట్ల ఆత్మహత్య చేసుకొన్న కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సతీమణి రచన అనుమానాలను వ్యక్తం చేశారు. పోలీసులు ఈ కేసులో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకొన్న రోజును ఆందోళన చేసిన గ్రామస్తులను పోలీసులు ఎలా గుర్తించారని ఆమె ప్రశ్నించారు. కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ సిసీ టీవి పుటేజీ ఎందుకు ఓపెన్ కావడం లేదని ఆమె ప్రశ్నించారు. చనిపోయిన ప్రభాకర్ రెడ్డి ఈ విషయంలో మాట్లాడే పరిస్థితి లేనందున శిరీష కేసును ఆయనకు అంటగడుతున్నారని ఆమె మీడియాకు చెప్పారు.

ప్రభాకర్ రెడ్డి హత్యే

ప్రభాకర్ రెడ్డి హత్యే

తన భర్తది ముమ్మాటీకీ హత్యేనని , తప్పుడు కేసులతో తన భర్తపై నిందలు వేస్తున్నారని కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి భార్య రచన ఆరోపించారు. బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసులో పోస్ట్ మార్టం నివేదికను బయటపెట్టినప్పుడు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి పోస్ట్ మార్టమ్ నివేదికను ఎందుకు బయటపెట్టలేదని ఆమె ప్రశ్నించారు. మొబైల్ డేటా, కాల్ డేటా ఎందుకు చూపించడం లేదని ఆమె ప్రశ్నించారు. ఒక ఎస్ఐ కుటుంబానికి ఈ పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. రేపు తాను ఐజీని కలువనున్నట్టు చెప్పారు. న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తానని చెప్పారు.

తేజస్వినిని బెదిరించేందుకే

తేజస్వినిని బెదిరించేందుకే

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు కాకుండా ఉండేందుకుగాను కుకునూర్ పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డిని ఆశ్రయించినట్టుగా రాజీవ్ పోలీసుల విచారణలో వెల్లడించారు.తేజస్వినిని బెదిరించాలనే ఉద్దేశ్యంతోనే తాము ప్రభాకర్ రెడ్డిని కోరినట్టు రాజీవ్ పోలీసుల విచారణలో చెప్పారు. ఎప్ఐఆర్ రిజిస్టర్ అయితే తమకు అనుకూలంగా వ్యవహరించాలని ఎస్ఐ ప్రభాకర్ రెడ్డితో బంజారాహిల్స్ ఎస్ఐ హరీందర్ కు చెప్పించినట్టు రాజీవ్ పోలీసుల విచారణలో చెప్పారు.

ముగిసిన పోలీస్ కస్టడీ

ముగిసిన పోలీస్ కస్టడీ

బ్యూటీషీయన్ శిరీష కేసులో నిందితులైన రాజీవ్,శ్రవణ్ ల పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో పోలీసులు నిందితులను పోలీసులు జైలులో హజరపర్చనున్నారు. రెండు రోజుల పాటు శిరీషను కేసులో మరిన్ని వాస్తవాలను తెలుసుకొనేందుకుగాను పోలీసులు రెండురోజుల పాటు కస్టడీకి తీసుకొన్నారు. సోమ, మంగళవారంతో రాజీవ్, శ్రవణ్ ల కస్టడీ ముగిసింది. వారిని జైలుకు తరలించనున్నారు.

English summary
why police didn't revealed si prabhakar reddy postmortem report asked family mebers. Prabhakar reddy wife rachana allegations on sirisha suicide investigation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X