వరంగల్‌లో దారుణం: భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను గొడ్డలితో అత్యంత దారుణంగా భార్య నరికి చంపిన ఘటన భూపాలపల్లి మండలం జంగేడు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే... నాగరాజు (35) అనే వ్యక్తి గతన కొన్ని నెలలుగా వ్యక్తిగత సమస్యల వల్ల తాగుడుకు బానిసై తన భార్యను, అత్తను వేధింపులకు గురి చేస్తున్నాడు.
దీంతో భర్త వేధింపులను తట్టుకోలేని భార్య ఆదివారం రాత్రి గొడ్డలితో అత్యంత దారుణంగా భార్య నరికి చంపింది. అనంతరం భర్త మృతదేహాన్ని ఇంట్లో ఉంచి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబకలహాల కారణంగానే ఆమె ఈ దారుణానికి పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications