అక్రమ సంబంధం: భర్తను చంపేసి భార్య ఆడిన డ్రామా అడ్డం తిరిగింది
హైదరాబాద్: ప్రియుడి మోజులో పడి ఓ మహిళ తన భర్తను అత్యంత దారుణంగా చంపేసి డ్రామా ఆడింది. ప్రియుడితో శాశ్వతంగా కలిసి ఉండాలనే కోరికతో భర్తను చంపి పోలీసులకు చిక్కింది.
చంపేసి గుండెపోటు వచ్చిందంటూ భర్తను మహిళ ఆస్పత్రికి తీసుకుని వెళ్లింది. దాంతో కథ అడ్డం తిరిగింది. హైదరాబాదులోని బాలానగర్‌లో జరిగిన ఈ హత్యోదంతంలో ప్రియుడు, మహిళ జైలు పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను బాలానగర్ ఎస్పి గోవర్థన్ మీడియాకు వెల్లడించారు.

వారు విజయనగరం జిల్లాకు చెందినవారు
విజయనగరం జల్లా పనుకువలస గ్రామానికి చెందిన పెద్దింటి జగదీశ్వర్ రావుకు ఎనిమిదేళ్ల క్రితం అదే జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన తులసి అనే యువతితతో పెళ్లయింది. వారికి ఇద్దరు కుమారులు..

ఉపాధి కోసం హైదరాబాదుకు....
ఉపాధి కోసం జగదీశ్వర్ రావు కుటుంబం హైదరాబాదుకు వలస వచ్చింది. బాలానగర్‌లోని ఓ కంపెనీలో అతను ఉద్యోగం చేస్తున్నాడు అదే కంపెనీలో పనిచేస్తన్న వీరబాబుతో జగదీశ్వర్ రావుకు పరిచయం పెరిగింది. దీంతో వీరబాబు జగదీశ్వర్ రావు ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో తులసికి వీరబాబుతో అక్రమ సంబంధం ఏర్పడింది.

చీరతో ఉరేసి చంపి..
అక్రమ సంబంధం గురించి తెలిసిన జగదీశ్వర్ రావు తులసిని మందలిస్తూ వచ్చాడు. దీంతో ఆమె భర్తను వదిలించుకోవాలని అనుకుంది. ఐదు రోజుల క్రితం భర్త మధ్యాహ్నం భోజనానికి వచ్చిన సమయంలో చీరతో ఉరివేసి అతన్ని చంపేసింది.

గుండెపోటు అంటూ ఆస్పత్రికి తీసుకుని వెళ్లి...
విషయం బయటపడకూడదని భర్త మృతదేహాన్ని వీరబాబుతో కలిసి తులసి ఆస్పత్రికి తీసుకుని వెళ్లింది. గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తెచ్చినట్లు చెప్పింది. అయితే, అది గుండె పోటు కాదని, హత్య అని వైద్యులు తేల్చారు.

వైద్యులు సమాచారం ఇవ్వడంతో...
వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి తులసిని, ఆమె ప్రియుడు వీరబాబుని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించారు.












Click it and Unblock the Notifications