మద్యానికి బానిసగా మారిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్... భార్యను ఏం చేశాడంటే
మద్యానికి బానిసగా మారిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన భార్యను కత్తితో పొడిచి చంపిప ఘటన హైద్రాబాద్ దమ్మాయిపేటలో చోటుచేసుకొంది. పదేళ్ళ క్రితం చక్రపాణికి, మాధవికి వివాహమైంది.
జవహర్ నగర్ : మద్యానికి బానిసగా మారిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఒకరు భార్యను విచక్షణరహితంగా కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన జవహర్ నగర్ లో చోటుచేసుకొంది. పుట్టింటి నుండి ఆమెను తన ఇంటికి తీసుకు వచ్చి ఆయన ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
దమ్మాయిగూడకు చెందిన చక్రపాణికి సికింద్రబాద్ మెట్టుగూడకు చెందిన మాధవికి పదేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఇద్దదరు పిల్లలు. ఒక కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. చక్రపాణి హైటెక్ సిటీలోని బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. వివాహమైన ఏడాది వరకు వీరి దాంపత్యంలో ఎలాంటి ఇబ్బందులు లేవు.

తదనంతరం మద్యానికి బానిసగా మారిన చక్రపాణి భార్యను ప్రతి రోజూ వేధించేవాడు. పలుమార్లు ఆమెపై దాడి చేస్తే ఆమె అనేక సార్లు అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.వారం రోజుల క్రితం కూడ మాధవిపై చక్రపాణి దాడి చేశాడు. ఆమెను కొట్టి పిల్లలతో సహా ఆమెను పుట్టింటిలో వదిలేశాడు.
అయితే గురువారం సాయంత్రం మాధవిని తన ఇంటికి తీసుకువచ్చాడు చక్రపాణి. ఇంట్లోకి రాగానే మాధవిపై కత్తితో దాడి చేశాడు. ఆమె శరీరంపై 15 చోట్ల పొడిచాడు. ఈ ఘటనతో ఆమె అక్కడికక్కడే మరణించింది. మద్యం మత్తులో తన కూతురును తీసుకెళ్ళిన చక్రపాణిపై అనుమానం వచ్చిన ఆమె కుటుంబసభ్యులు చక్రపాణి వద్దకు వచ్చారు. రక్తపు మడుగులో మాధవి కన్పించింది.అప్పటికే ఆమె మరణించింది. పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications