హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిచయం.. ప్రేమ... సహజీవనం: అనుమానంతోనే ప్రేయసి హత్య, తాను ఆత్మహత్య (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సహజీవనం చేస్తోన్న ఇద్దరూ మృతి చెందడంతో ఒంటరైన బాలుడుని ఎట్టకేలకు తాతయ్య, నాయనమ్మ ఒడికి చేర్చారు. రెండు రోజుల క్రితం నగరంలోని కేపీహెచ్‌బీలో కర్ణాటకు చెందిన మంజునాథ్‌ అనే వ్యక్తి సహజీవనం చేస్తున్న మీనాను చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

పోలీసులు విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూశాయి. దీంతో కర్ణాటకలో ఉన్న మంజునాథ్‌ తల్లిదండ్రులకు, మీ నా తల్లికి సమాచారం అందించారు. ముంజునాథ్‌ తల్లిదండ్రులు శనివారం నగరానికి వచ్చి కుమారుడు మరో యవతిలో సహజీవనం చేసిన విషయాన్ని తెలుసుకుని అవాక్కయ్యారు.

గాంధీ ఆస్పత్రిలో శనివారం మంజునాథ్‌, మీనాలకు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం, మంజునాథ్‌ మృతదేహాన్ని అతని తల్లిదండ్రులకు అప్పగించారు. మనవడిని తమకు అప్పగించమని పోలీసులను కోరారు. మంజునాథ్‌ మృతదేహం ఉన్న అంబులెన్స్‌లోనే కేపీహెచ్‌బీలోని బేబీకేర్‌ సెంటర్‌కు వచ్చారు.

 అనుమానంతోనే ప్రేయసి హత్య, తాను ఆత్మహత్య

అనుమానంతోనే ప్రేయసి హత్య, తాను ఆత్మహత్య

కర్ణాటకలోని కోలార్ జిల్లా రోనూరు మండలం శ్రీనివాసపురానికి చెందిన మంజునాథ్ అనే వ్యక్తి కాగా, ఆమె కర్ణాటకకే చెందిన మాండ్యా జిల్లా చిక్కుపల్లికి చెందిన మీనా అని తెలుస్తోంది. మంజునాథ్‌కు అప్పటికే పెళ్లయింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మీనాకు ఎనిమిదేళ్ల క్రితం శ్యాంరాజు అనే వ్యక్తితో వివాహమైంది. ఆమెకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు.

అనుమానంతోనే ప్రేయసి హత్య, తాను ఆత్మహత్య

అనుమానంతోనే ప్రేయసి హత్య, తాను ఆత్మహత్య


ఆమె నాలుగేళ్ల క్రితం భర్త నుంచి దూరమైంది. అప్పట్లో కొరియర్‌ బాయ్‌గా పని చేస్తున్న మంజునాథ్‌కు, మీనాకు పరిచయమైంది. అది ప్రేమగా, వివాహేతర సంబంధంగా మారి, చివరికి సహ జీవనానికి దారి తీసింది. ఇద్దరూ తమ తమ ఇళ్లలో అబద్ధాలు చెప్పి, ఉద్యోగం పేరిట ఒక్కో నగరంలో కొన్నాళ్లు గడుపుతూ వచ్చారు. రెండేళ్లుగా ఇలాగే చేశారు.

అనుమానంతోనే ప్రేయసి హత్య, తాను ఆత్మహత్య

అనుమానంతోనే ప్రేయసి హత్య, తాను ఆత్మహత్య

వారికి ఏడాది క్రితం ఒక మగ పిల్లాడు పుట్టాడు. అలా మంజునాథ్‌, మీనా జంట ఐదు నెలల క్రితం ఈ జంట హైదరాబాద్‌ చేరుకుంది. వీరు కూకట్‌పల్లి కమలా ప్రసన్ననగర్‌లో ఓ పెంట్‌ హౌస్‌లో అద్దెకు దిగారు. మంజునాథ్‌ ఓ ఎలక్ట్రానిక్స్‌ షూ రూమ్‌లో సేల్స్‌మన్‌గా పనిచేస్తుండగా, మీనా నిజాంపేట్‌లోని ఓ షోరూంలో సేల్స్‌గర్ల్‌గా పని చేస్తోంది. బాలుడిని ఇంటి సమీపంలో ఉన్న ఓ ప్లే స్కూల్‌లో ఉంచి వీరు విధులకు వెళ్లేవారు.
అనుమానంతోనే ప్రేయసి హత్య, తాను ఆత్మహత్య

అనుమానంతోనే ప్రేయసి హత్య, తాను ఆత్మహత్య


కాగా, రెండు రోజులుగా ఇంటి ముందు పడేసిన పాల ప్యాకెట్లు అలాగే ఉండటంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం పెంట్‌హౌస్‌ వద్దకు వెళ్లి చూడగా బాలుడి మూలుగు వినిపించింది. తలుపుకొట్టినా స్పందన లేకపోవడంతో ఇంటి యజమాని స్థానికుల సాయంతో బలప్రయోగంతో గది తలుపు తెరిచారు. తలుపు వద్ద రక్తపు మడుగులో మీనా మృతదేహం పడి ఉంది. చీరతో ఉరి వేసుకున్న మంజునాథ్‌ దేహం కనిపించింది.

 అనుమానంతోనే ప్రేయసి హత్య, తాను ఆత్మహత్య

అనుమానంతోనే ప్రేయసి హత్య, తాను ఆత్మహత్య


మంజునాథ్‌ మీనాను చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. అక్కడ లభించిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది కన్నడంలో రాసి ఉంది. ‘నిన్ను నమ్మి భార్యా పిల్లలను వదిలేసి వస్తే నన్ను మోసం చేశావు. మన ప్రేమ బలపడాలంటే మనద్దరి చావే శరణ్యం' అని అందులో ఉంది.

అనుమానంతోనే ప్రేయసి హత్య, తాను ఆత్మహత్య

అనుమానంతోనే ప్రేయసి హత్య, తాను ఆత్మహత్య


దీన్ని బట్టి చూస్తే మీనా మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతోనే ఆమెను చంపి, అతను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని అనుమానిస్తున్నారు. ఇదిలావుంటే, మీనా తన కుమారుడు కౌశిక్‌ను తల్లి ఈశ్వరమ్మ వద్ద ఉంచి హైదరాబాద్‌లో ఉద్యోగం పేరిట మంజునాథ్‌తో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మీనా, మంజునాథ్‌ బుధవారం రాత్రే చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఈ బేబీ కేర్‌ సెంటర్‌లోనే మంజునాథ్‌, మీనాలు తమ కుమారుడిని వదిలి పెట్టి నిత్యం విధులకు వెళ్తుంటారు. బాలుడిని తీసుకువెళ్లడానికి మంజునాథ్‌ తల్లిదండ్రులు రావడంతో ఇన్ని రోజులు సంరక్షించిన బేబీకేర్‌ నిర్వాహకురాలు చంద్రకళ, జగద్గిరిగుట్ట పోలీసుల సమక్షంలో బాలుడిని తాతయ్య, నాయనమ్మలకు అప్పగించింది.

మీనా తండ్రి గతంలోనే మృతి చెందాడు. దీంతో ఆమె మృతదేహాన్ని ఆమె తల్లికి ఈశ్వరమ్మకు అప్పగించారు. భర్త కూడా గతంలోనే మరణించిన కూతురు మృతదేహాన్ని కర్ణాటకకు తీసుకువెళ్లనని ఇక్కడే నగరంలోనే అంత్యక్రియలు జరిపిస్తానని ఈశ్వరమ్మ పోలీసులకు తెలిపింది.

దీంతో మీనా మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి అనంతరం పోస్టుమార్టం రూమ్‌లోనే ఉంచారు. ఆ మె మృతదేహాన్ని ఆదివారం తల్లికి అప్పగించనున్నారు. కూతురు ఉ ద్యోగం కోసమే నగరానికి వచ్చినట్లు తెలిపిందని, ఓ వ్యక్తితో సహజీవ నం చేస్తున్న సంగతి ఇక్కడికొచ్చేవరకు తెలియదని ఆమె చెప్పింది.

English summary
Police found a suicide note written in Kannada by the husband Manjunath, 30, who claimed in the note that he and his wife Meena Rani were undergoing several financial crisis and thus decided to end their lives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X