రాఖీ వేళ కవితతో - కేటీఆర్ ఎమోషనల్..!!
రాఖీ పర్వదినం వేళ కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు. సోదరి కవితతో ప్రతీ ఏటా రాఖీ జరుపుకున్న సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ప్రతీ సంవత్సరం కవిత తన సోదరుడు కేటీఆర్ కు రాఖీ కట్టేవారు. అయితే, కవిత ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉన్నారు. కవితను కేటీఆర్ తాజాగా జైల్లో పరామర్శించారు. త్వరలోనే బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. సుప్రీంకోర్టు తాజాగా కవితకు బెయిల్ మంజూరు చేయలేదు.
ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అయిదు నెలల కాలంగా జైల్లో ఉన్నారు. కేటీఆర్, హరీష్ ఇప్పటికే పలు మార్లు ఢిల్లీ వెళ్లి కవితను పరామర్శించారు. కవిత బెయిల్ అంశం పైనా న్యాయ నిపుణులతో చర్చించారు. తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చింది. దీంతో, కవితకు సైతం బెయిల్ మంజూరు అవుతుందని ఆశించారు. వారం రోజల్లో కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందని కేటీఆర్ ఢిల్లీలో పేర్కొన్నారు. కానీ, ఇప్పటికీ కవితకు బెయిల్ దక్కలేదు.

You may not be able to tie Rakhi today But will be with you through thick and thin ❤️#Rakhi 2024 pic.twitter.com/mQpfDeqbkc
— KTR (@KTRBRS) August 19, 2024
కవిత జైలుకు వెళ్లిన తరువాత 11 కిలోల బరువు తగ్గారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేసారు. ఇక, నేడు రాఖీ వేళ కవితను ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేసారు. తన సోదరి కవిత ఈ రోజు తనకు రాఖీ కట్టలేకపోవచ్చునని, కానీ ఆమెకు ఏ కష్టమొచ్చినా తాను ఎళ్లవేలలా అండగా ఉంటానని కేటీఆర్ పేర్కొన్నారు. 'ఈ రోజు నువ్వు రాఖీ కట్టలేకపోవచ్చు. కానీ నీకు కష్టమొచ్చినా నేను అండగా ఉంటా' అని ఆయన పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు లవ్ సింబల్‌ను జతచేశారు. గతంలో సోదరి కవిత తనకు రాఖీ కట్టిన ఫొటోను షేర్ చేశారు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications