జాతీయ పార్టీ ఏర్పాటు కసరత్తులో సీఎం కేసీఆర్.. సక్సెస్ అవుతారా? జోరుగా చర్చ

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టారు. కొత్త జాతీయ పార్టీగా భారత రాష్ట్రీయ సమితిని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ శరవేగంగా పావులు కదుపుతున్నారు. దీనికి సంబంధించి జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై దృష్టి సారించిన కేసీఆర్ నేతలు, మేధావులతో జాతీయ కార్యవర్గం కూర్పుకు సమాలోచనలు జరుపుతున్నారు.

 కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు నిర్ణయం సరైనదేనా?

కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు నిర్ణయం సరైనదేనా?

అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు నిర్ణయం సరైనదేనా? ఇందులో కేసీఆర్ సక్సెస్ అవుతారా? అసలు కెసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయం వెనుక ఉన్న బలమైన కారణాలేంటి ? అన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణాలో సక్సెస్ అయిన కేసీఆర్ ఇతర రాష్ట్రాలలో సక్సెస్ కావటం నల్లేరు మీద నడక కాదన్న చర్చ జరుగుతుంది.

జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేలా కేసీఆర్ వ్యూహాలు

జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేలా కేసీఆర్ వ్యూహాలు


తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన సెంటిమెంటుతో తెలంగాణ ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాన్ని చేపట్టి, ఆపై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు రెండు దఫాలుగా అధికారాన్ని కట్టబెట్టారు. ఇక మూడవ సారి కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీగా నిలబడాలని ప్రయత్నం సాగిస్తున్న కేసీఆర్, మరొక జాతీయ పార్టీగా టిఆర్ఎస్ పార్టీని మార్చే పనిలో పడ్డారు. ఈ నెల మూడోవారంలో కొత్త పార్టీ ప్రకటనపై ఇప్పటికే కసరత్తు చేపట్టిన సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలతో జాతీయ రాజకీయాలలో కీలక భూమిక పోషించేలా వ్యూహాలు రచిస్తున్నారు.

కేసీఆర్ జాతీయ పార్టీపై చర్చ.. ఈజీ టాస్క్ కాదంటూ ..

కేసీఆర్ జాతీయ పార్టీపై చర్చ.. ఈజీ టాస్క్ కాదంటూ ..

అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆలోచనలకు, ఇతర ప్రాంతాలలో ప్రజల ఆలోచనలకు చాలా భిన్నత్వం ఉంటుందని, తెలంగాణ ప్రజలు తెలంగాణ సెంటిమెంటుతో సీఎం కేసీఆర్ కు పట్టం కట్టారని, మిగతా రాష్ట్రాల ప్రజలు అంతగా కేసీఆర్ ను ఆదరించకపోవచ్చు అన్న చర్చ స్థానిక ప్రజలు జోరుగా జరుగుతోంది. తనయుడు మంత్రి కేటీఆర్ ను సీఎం చేయడం కోసం, కెసిఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారు అన్న చర్చ కూడా ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ప్రజలను ప్రతి ఎన్నికల సమయంలో లోకల్ అంటూ లోకల్ సెంటిమెంట్ తో పడేసే కేసీఆర్, మిగతా రాష్ట్రాల ప్రజలను తనకు అనుకూలంగా మార్చుకోవడం అంత ఈజీ టాస్క్ కాదని చర్చిస్తున్నారు.

కెసీఆర్ జాతీయ రాజకీయాల్లో సక్సెస్ అవుతారా?

కెసీఆర్ జాతీయ రాజకీయాల్లో సక్సెస్ అవుతారా?

ఒకపక్క రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు దూకుడు చూపిస్తుంటే, ఇదే సమయంలో కెసిఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయడం అంత మంచిది కాదనే అభిప్రాయం కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. గతంలో జాతీయ పార్టీ అయిన బీజేపీతో, కెసిఆర్ కంటే గట్టిగా పోరాటం చేసిన చంద్రబాబు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయారని కూడా చర్చిస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలో కెసిఆర్ ఏ విధంగా జాతీయ రాజకీయాలలో సక్సెస్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారిన చర్చ. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీని ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళితే, జాతీయ రాజకీయాల్లో మాత్రం అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి అనేది విస్పష్టం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+