తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ మరింత వేగవంతం: 100 శాతం టార్గెట్ అంటూ సీఎస్ ఆదేశాలు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేయనున్నట్లు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. వందశాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించేందుకు క్షేత్రస్థాయిోల సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌పై జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల కార్యదర్శులు, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్, బ్రెజిల్, జర్మనీ, నెదర్లాండ్స్, చైనా లాంటి దేశాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోందని సీఎస్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 3 కోట్ల కోవిడ్ డోసులను పంపిణీ చేసినట్లు సీఎస్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు గ్రామ, వార్డు స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ బృందంలో ఆశా వర్కర్, అంగన్వాడీ వర్కర్, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏ సభ్యులుగా ఉండాలన్నారు.

Will Increase speed: Telangana CS Somesh Kumar review on Corona vaccination

ప్రతి గ్రామానికి నోడల్ అధికారి, మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి నిత్యం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ డోసులు సరిపడా ఉన్నాయని తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి కేవలం రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోవడమే ఏకైక మార్గమని సందేశాన్ని ప్రతి ఒక్కరిలో కల్పించాలన్నారు.

తెలంగాణలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. అయితే, ఒక్కోసారి కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 41,388 మంది నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 190 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

తాజాగా, నమోదైన 190 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,70,643కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3950గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1114 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 111 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,62,592కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,101 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది.

Recommended Video

    Huzurabad By Poll: ఇంత ఖరీదైన ఎన్నిక ఇక ముందు రాదు Mahesh Kumar Goud

    తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 01, భద్రాద్రి కొత్తగూడెంలో 07, జీహెచ్ఎంసీలో 68. జగిత్యాలలో 06, జనగామలో 03, జయశంకర్ భూపాలపల్లిలో 02, జోగులాంబ గద్వాలలో 00, కామారెడ్డిలో 02, కరీంనగర్‌లో 07, ఖమ్మంలో 04, కొమురంభీం ఆసిఫాబాద్ లో 03, మహబూబ్‌నగర్‌లో 04, మహబూబాబాద్‌లో 02, మంచిర్యాలలో 03, మెదక్‌లో 01, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 14, ములుగులో 01, నాగర్ కర్నూలులో 02, నల్గొండలో 08, నారాయణపేటలో 01, నిర్మల్‌లో 00, నిజామాబాద్‌లో 01, పెద్దపల్లిలో 05, రాజన్న సిరిసిల్లలో 03, రంగారెడ్డిలో 13, సంగారెడ్డిలో 04, సిద్దిపేటలో 04, సూర్యాపేటలో 05, వికారాబాద్ లో 00, వనపర్తిలో 02, వరంగల్ రూరల్‌లో 04, వరంగల్ అర్బన్‌లో 06, యాదాద్రి భువనగిరిలో 04 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 3 జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+