వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Nagarjuna Sagar లో జానారెడ్డి వెనుకంజ అందుకేనా.! గులాబీ పార్టీ నేతల ఆరోపణలే కరెక్టా..?

|
Google Oneindia TeluguNews

నాగార్జున సాగర్/హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక హోరా హోరీగా సాగుతుందనుకుంటే ఏకపక్ష ఫలితం వచ్చేలా కనిపిస్తోంది. సాగర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య అకాల మృతితో అనివార్యమైన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి తప్పక విజయం సాదిస్తారనే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. కాని ఫలితాలు మాత్రం అందుకు విరుద్దంగా వెలువడుతుండడం కాంగ్రెస్ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మీద, జానారెడ్డి మీద అధికార పార్టీ నేతలు ప్రచారం సందర్బంగా చేసిన ఆరోపణలు వాస్తమేనా అనే సందేహాలు సామాన్య ప్రజానికానికి కలుగుతున్నాయి.

సాగర్ లో జానారెడ్డికి నిరాశ.. నిరూపిస్తున్న ఫలితాలు..

సాగర్ లో జానారెడ్డికి నిరాశ.. నిరూపిస్తున్న ఫలితాలు..

నాగార్జున సాగర్ ఉప పోరు రసవత్తరంగా సాగుతుందనుకుంటే మొత్తం అదికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు వెలువడుతున్నట్టు నిర్దారణ అవుతోంది. అధికార గులాబీ పార్టీ నేతల ప్రచారం, కాంగ్రెస్ పార్టీతో పాటు ఆబ పార్టీ అభ్యర్ధి కుందూరు జానా రెడ్డి మీద చేసిన ఆరోపణలను సాగర్ ప్రజలు విశ్వసించినట్టు తెలుస్తోంది. జానారెడ్డి సుధీర్ఘ రాజకీయ అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా యువకుడు నోముల భగత్ కు జై కొడుతున్నారు సాగర్ ప్రజలు. 2018ముందస్తుగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా జానారెడ్డి రెండవ స్దానంలో నిలిచారు. ఉప ఎన్నిక సందర్బంగా గెలుపు ఖాయం అనుకున్న జానారెడ్డి రెడ్డికి నిరాశే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పని చేసిన గులాబీ నేతల ప్రచారం.. జానారెడ్డికి కలిసిరాని కాంగ్రెస్ అభివృద్ది మంత్రం..

పని చేసిన గులాబీ నేతల ప్రచారం.. జానారెడ్డికి కలిసిరాని కాంగ్రెస్ అభివృద్ది మంత్రం..

హాలియా సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పిన అంశాలను, అనుముల గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పిన అంశాలను నాగార్జున సాగర్ ప్రజలు శ్రద్దగా ఆలకించినట్టు తెలుస్తోంది. అధికార పార్టీ నేతలతో పాటు స్వయంగా ముఖ్యమంత్రే అభివృద్ది గురించి చెప్పడం, ఆ తర్వాత యువ నాయకుడు కేటీఆర్ కూడా అదే అంశాన్ని యువతకు చెప్పడంలో విజయం సాధించనట్టు తెలుస్తోంది. తెలంగాణ సాధించుకున్న తర్వాత, తెలంగాణ సాధన ముందు పరిస్దితులను సవివరంగా వివరించి సాగర్ ప్రజల మనసులను గెలుచుకున్నట్టు తెలుస్తోంది.

కేసీఆర్ హాలియా సభ ప్రభావం.. గులాబీకే జై కొట్టిన ప్రజలు..

కేసీఆర్ హాలియా సభ ప్రభావం.. గులాబీకే జై కొట్టిన ప్రజలు..

గులాబీ పార్టీ ఏడేళ్ల పాలనలో తెలంగాణ ఎంత అభివృద్ది సాధించిందో ప్రజలే స్వయంగా బేరీజు వేసుకోవాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ పరిస్దితి ఎలా ఉందో చూడాలని ముఖ్యమంత్రి ప్రచారం సందర్బంగా ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్దిని, తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్దిని చూసి ఓటు వేయాలని సాగర్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు ముఖ్యమంత్రి. అంతే కాకుండా జానారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసిన అబివృద్ది శూన్యమని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసారు అధికార పార్టీ నాయకులు.

Recommended Video

Gangavva ఇంటి పనులు.. ఓ పనైపోయింది ! || Oneindia Telugu
అధికార గులాబీ పార్టీనే నమ్మిన సాగర్ ప్రజలు.. కాంగ్రెస్ పార్టీకి మరోసారి తప్పని బంగపాటు..

అధికార గులాబీ పార్టీనే నమ్మిన సాగర్ ప్రజలు.. కాంగ్రెస్ పార్టీకి మరోసారి తప్పని బంగపాటు..

ప్రధానంగా రాజకీయ విరమణ సమయంలో జానారెడ్డి పోటీ చేయడం వల్ల సాగర్ నియోజకవర్గానికి ఒరిగేది ఏమి ఉండదని టీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. అంతే కాకుండా జానారెడ్డి సుధీర్గ రాజకీయ జీవితంలో సాగర్ ఉప ఎన్నికలే చివరి ఎన్నికలుగా కూడా అదికార పార్టీ నేతలు ప్రచారం చేసారు. మరికొంచేం డోస్ పెంచి అసలు జానా రెడ్డి ప్రస్తుత రాజకీయాలకు పనికిరాని వ్యక్తిగా అభివర్ణించారు. ఇలాంటి అంశాలన్ని కాంగ్రెస్ పార్టీకి ప్రతిబందకంగా మారినట్టు తెలుస్తోంది. ఈ అంశాలన్ని జానారెడ్డికి ప్రతికూలంగా మారినట్టు వెలువడుతున్న ఫలితాలు నిరూపిస్తున్నాయి.

English summary
With the death of sitting MLA Nomula Narsinghmayya in Sagar, expectations have skyrocketed that Congress candidate Kunduru Janareddy must win the inevitable by-election. But the results, on the contrary, seem to have taken the Congress ranks by surprise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X