Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గతంలోలా కాదు: ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చిన సీఎం రేవంత్

రాష్ట్రంలోని ఉద్యోగులు సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో ఉద్యోగ - ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంలతో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

టీజీవో, టీఎన్జీవో సంఘాల ప్రతినిధులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్ సంఘాల నేతలు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించిన మల్టీ జోన్, స్పౌస్ సమస్యలు, స్థానికత, ఉపాధ్యాయుల బదిలీలు, ఆరోగ్య బీమా, పెండింగ్‌లో ఉన్న డీఏలు తదితర సమస్యల గురించి ముఖ్యమంత్రికి విన్నవించారు.

will solve every issue CM Revanth in Employees Union leaders meeting

వీటన్నంటిపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. గత పదేళ్లుగా సమస్యలు చెప్పుకునే అవకాశం ఉద్యోగులకు రాలేదని రేవంత్‌రెడ్డి అన్నారు. వారి సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం స్పష్టం చేశారు. ఉద్యోగుల డీఏ, ఇతర అంశాలపై కేబినేట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాలకు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం నియమించామని సీఎం వారికి తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ ఇస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కిందిస్థాయి సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ఉద్యోగుల తరపున ప్రాతినిధ్యం ఉండాలని రేవంత్‌రెడ్డి సూచించారు. ఉద్యోగా సంఘాలపై కక్షగట్టి వాటిని రద్దు చేస్తే.. ప్రజలు కేసీఆర్(KCR) ప్రభుత్వాన్ని రద్దు చేశారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

అన్ని సంఘాల అభిప్రాయాలతోనే తమ నిర్ణయాలుంటాయన్నారు సీఎం రేవంత్.
1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. కోదండరాం ఎమ్మెల్సీగా ఉంటే శాసనమండలికి గౌరవం ఉండేదన్నారు సీఎం రేవంత్. గవర్నర్‌తో చర్చించి కోదండరాంను మండలికి పంపుతామని రేవంత్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణను తామే సాధించామని ఏ ఒక్కరు చెప్పుకున్నా అది అసంబద్ధమని బీఆర్ఎస్ నేతలకు చురకలంటించారు. విద్యార్థి, ఉద్యోగ, కార్మికుల పోరాటంతో తెలంగాణ సిద్ధించిందని చెప్పారు. రక్తం చిందించకుండా తెలంగాణ సాధించానని కేసీఆర్ అంటారు. కేసీఆర్ కుటుంబంలో ఎవరి రక్తం చిందలేదేమో.. కానీ, రాష్ట్రం కోసం చాలా మంది ప్రాణాలు, రక్తం ధారపోశారని సీఎం రేవంత్ చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+