ఇండియా గేట్ వద్ద పారబోస్తం: వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై తెలంగాణ మంత్రులు ఫైర్

న్యూఢిల్లీ: వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో దాదాపు ఇంకా 60 లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉందని, మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఢిల్లీ తీసుకొచ్చి ఇండియాగేటు వద్ద పారబోస్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

కేంద్రం నుంచి స్పందనేది: మంత్రి ప్రశాంత్ రెడ్డి

కేంద్రం నుంచి స్పందనేది: మంత్రి ప్రశాంత్ రెడ్డి

ఢిల్లీలో మంత్రి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం సేకరణపై మాట్లాడేందుకు వారం రోజుల క్రితం మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వచ్చినా కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదన్నారు. తెలంగాణలో పండిన ధాన్యంలో 60 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని ఇండెంట్ ఇచ్చారని తెలిపారు. నేటితో ఆ టార్గెట్ పూర్తయిందన్నారు. రాబోయే 60 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యాన్ని కూడా సేకరిస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు విజ్ఞప్తి చేసినట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రెండ్రోజులు సమయం ఇవ్వాలని అడిగారని, రెండ్రోజులు గడిచినా ఎలాంటి స్పందనా లేదన్నారు. రెసిడెంట్ కమిషన్ ద్వారా పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్ అడిగినా ఇంకా ఇవ్వలేదని, ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన పద్ధతి ఇది కాదని అన్నారు.

పీయూష్ గోయల్ పార్లమెంటులో అలా చెప్పారు: ప్రశాంత్ రెడ్డి

పీయూష్ గోయల్ పార్లమెంటులో అలా చెప్పారు: ప్రశాంత్ రెడ్డి

తెలంగాణ రైతుల తరపున కేంద్రం వైఖరిని తీవ్రంగా పరగిణిస్తున్నామని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయని, బియ్యం సేకరణపై ఎఫ్‌సీఐ, కేంద్రం గోడౌన్లు పెంచలేదన్నారు. వానాకాలంలో రైతులు పండించిన 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి, డబ్బులు చెల్లిస్తుందని తెలిపారు. తెలంగాణలో వానాకాలంలో ఎంత పండితే అంత ధాన్యం తీసుకుంటామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో మాట ఇచ్చారన్నారు. మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హామీ ఇచ్చారని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అయినా, స్పష్టత ఇవ్వలేదన్నారు.

ఇండియా గేటు వద్ద వరిధాన్యం పారబోస్తం: మంత్రి ప్రశాంత్ రెడ్డి

ఇండియా గేటు వద్ద వరిధాన్యం పారబోస్తం: మంత్రి ప్రశాంత్ రెడ్డి

పార్లమెంటులో ఇచ్చిన మాట ప్రకారం.. లిఖితపూర్వక హామీ ఇస్తూ లేఖ ఇవ్వకపోతే రైతుల వద్ద కొనుగోలు చేసిన 60 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని ఢిల్లీ తీసుకొచ్చి ఇండియా గేటు వద్ద పారబోస్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ రైతులను అవమానించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మంత్రి మండిపడ్డారు. పండించిన పంట కొనుగోలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. తెలంగాణ బియ్యం తీసుకునే ఉద్దేశం కేంద్రానికి లేదన్నారు. గోదాముల్లో ఉన్న బియ్యం తరలించకుండా రాష్ట్రంపై నెపం మోపడం సరికాదన్నారు. వడ్ల సేకరణ లక్ష్యాన్ని పెంచాలన్నారు. పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలంతా 9 రోజులపాటు పోరాడారని చెప్పారు. మరో రెండ్రోజుల్లో సమస్యను పరిష్కరించాలని మంత్రులు డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+