• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు మేలు చేస్తున్న షర్మిల ? బీజేపీకి కావాల్సింది అదే ! అమిత్ షా ప్లాన్ వర్కవుట్ ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో తన అన్న వైఎస్ జగన్ తో విభేదించి తెలంగాణలో వేరు కుంపటి పెట్టుకున్న వైఎస్ షర్మిల వేస్తున్న అడుగులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. బీజేపీ వదిలిన బాణంగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న షర్మిల తన తాజా దూకుడుతో అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్న తీరు చూస్తుంటే కచ్చితంగా అది కాషాయ శిబిరంతో పాటు చంద్రబాబుకు మేలు చేసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై సైతం విమర్శలు గుప్పించడం ద్వారా చంద్రబాబుకు షర్మిల చేస్తున్న సాయం ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది.

వైఎస్ షర్మిల వ్యూహాలు

వైఎస్ షర్మిల వ్యూహాలు


వైఎస్సార్ టీపీ స్ధాపనతో తెలంగాణలో సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్ షర్మిల అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే అధికారం మాట అటుంచితే షర్మిల వ్యాఖ్యలు రేపుతున్న చిచ్చు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ తో పాటు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతల్ని సైతం టార్గెట్ చేస్తూ ఆమె చేస్తున్న మాటల దాడి తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అదే సమయంలో ఈసారి ఎలాగైనా అధికారం అందుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి మేలు చేస్తోంది. అంతే కాదు బీజేపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు కూడా మేలు చేసేలా ఉంది.

 టీఆర్ఎస్, కాంగ్రెస్, వైసీపీ లక్ష్యంగా

టీఆర్ఎస్, కాంగ్రెస్, వైసీపీ లక్ష్యంగా

తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతున్న మాట వాస్తవం. దీన్ని గ్రహించిన షర్మిల టీఆర్ఎస్ ను టార్గెట్ చేయడంలో ఆశ్చర్యం లేదు. కానీ విపక్షంలో ఉన్న కాంగ్రెస్ ను, ఏపీలో అధికారంలో ఉన్న తన అన్న పార్టీ వైసీపీని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. మరి కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్ ను ఒకే గాటిన కడుతూ షర్మిల టార్గెట్ చేస్తున్న వైనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యంగా ఇదంతా ఆమె అసలు అజెండాలో భాగమేనన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీజేపీకి మేలు చేసేందుకే పార్టీ స్ధాపించి యాత్ర చేస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న క్రమంగా తన రాజకీయ వైఖరిని బయటపెడుతున్నారు.

చంద్రబాబుకు మేలు చేస్తున్నారా ?

చంద్రబాబుకు మేలు చేస్తున్నారా ?


తెలంగాణలో ఒకప్పుడు దాదాపు టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు పోటాపోటీగా నిలిచి ఆ తర్వాత దాదాపు కనుమరుగైన టీడీపీకి తిరిగి ఊపిరిపోసేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయనకు పరిస్ధితులు కలిసి రావడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్ లోని కొందరు కమ్మ సామాజిక వర్గ పెద్దల అండతో తిరిగి అక్కడ రాజకీయాలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇది గ్రహించిన బీజేపీ ఆయన్ను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు షర్మిల అయితే ఏకంగా చంద్రబాబుకు మేలుచేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి జగన్ సోదరిగా ఆంధ్రా ముద్రతో ముందుకొచ్చిన షర్మిల రాకతో చంద్రబాబుపై ఉన్న ఆంధ్రా పార్టీ ముద్ర కొంత డైల్యూట్ అయ్యే అవకాశం ఎలాగో ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పుపై షర్మిల చేసిన వ్యాఖ్యలు తన అన్న జగన్ ను ఇరుకునపెట్టేలా, అదే సమయంలో చంద్రబాబుకు మద్దతుగా ఉన్నాయి.

అమిత్ షా బిగ్ ప్లాన్ లో భాగమేనా ?

అమిత్ షా బిగ్ ప్లాన్ లో భాగమేనా ?


తెలంగాణలో ఈసారి ఎలాగైనా బీజేపీకి అధికారం అందించేందుకు ఎత్తులు, పైఎత్తులు వేస్తున్న అమిత్ షా అటు చంద్రబాబును కలుపుకునేందుకు సిద్ధమయ్యారు. సరైన సమయంలో చంద్రబాబును తెలంగాణ రాజకీయంలోకి ఎంట్రీ ఇప్పించేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో బీజేపీ వదిలిన బాణంగా పేరు తెచ్చుకున్న షర్మిల సైతం చంద్రబాబుకు మద్దతుగా తెరవెనుక రాజకీయాన్ని మార్చే పనిలో ఉన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ లను టార్గెట్ చేస్తూ వైఎస్సార్, ఎన్టీఆర్ లెగసీల్ని ప్రస్తావిస్తూ షర్మిల చేస్తున్న ప్రసంగాలు ఇప్పుడు అమిత్ షా బిగ్ ప్లాన్ లో భాగమేనన్న ప్రచారం జరుగుతోంది. షర్మిల వ్యాఖ్యలు అంతిమంగా బీజేపీ-చంద్రబాబు ద్వయానికి మేలు చేసేలా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది.

English summary
ys sharmila's latest war give indications on her future course of action against congress and trs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X