మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం సొంత జిల్లాలో హెల్మెట్ ధరించి టీచర్ల పాఠాలు: ఎందుకంటే?

ముఖ్యమంత్రి సొంత జిల్లాలో పాఠశాలల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో తెలియజేస్తోందీ టీచర్ల నిరసన.

|
Google Oneindia TeluguNews

మెదక్: ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఓ పాఠశాల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో తెలియజేస్తోందీ కథనం. పాఠాలు చెప్ప‌డానికి టీచ‌ర్లకి ఓ పుస్త‌కం, బ్లాక్‌ బోర్డ్, చాక్‌పీస్ వంటికి అవ‌స‌ర‌మ‌వుతాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఇక్కడ మాత్రం క్లాస్‌రూమ్స్‌లో పాఠాలు చెప్ప‌డానికి టీచ‌ర్లు హెల్మెట్స్ ధరించాల్సి వ‌స్తోంది.

ఈ పరిస్థితి చిన్నశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెల‌కొంది. ఆ పాఠ‌శాల‌లోని టీచ‌ర్లు హెల్మెట్ ధ‌రించి పాఠాలు చెబుతున్న దృశ్యాలను జాతీయ మీడియా ఛానెళ్లు సైతం ప్ర‌చురించడం గమనార్హం. టీచర్లకు ఈ దుస్థితి రావడానికి ప్రభుత్వం, ప్రభుత్వ అధికారుల పట్టింపులేని తనమే కారణం.

With plasters falling off ceiling, teachers wear helmets inside classrooms

ఆ పాఠశాలలోని తరగతి గదుల్లోని సీలింగ్ ఇటీవల కురిసిన వర్షాలకి తడిసి ప్లాస్టరింగ్ రాలిప‌డుతోంది. ఒక్కోసారి వర్షం ఎక్కువ‌గా ప‌డితే క్లాస్ రూమ్‌లో వర్షపు నీరు ప‌డుతోంది. ఎంతో కాలంగా త‌మ‌ను వేధిస్తోన్న ఈ స‌మ‌స్య గురించి ప్ర‌భుత్వానికి తెల‌ప‌డానికి అక్కడి టీచర్లు ఇలా హెల్మెట్‌లు ధ‌రించి పాఠాలు చెబుతున్నారు.

గత మూడేళ్లుగా తాము ప‌డుతున్న బాధ‌ల గురించి ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వారు వాపోతున్నారు. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి ఈ స‌మ‌స్య‌ తీసుకెళ్లినప్పటికీ లాభం లేకుండాపోతోంద‌ని ఆ పాఠ‌శాల విద్యార్థులు, టీచ‌ర్లు ఓ జాతీయ మీడియాకు తెలిపారు. దీంతో జాతీయస్థాయిలో ఈ సమస్యకు ప్రచారం లభించింది. ఇప్పటికైనా ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులకు ప్రమాదకరంగా మారిన పాఠశాల సమస్యను తీర్చాల్సిన అవసరం ప్రభుత్వం, అధికారులపై ఉందని స్ఠానికులంటున్నారు.

English summary
Teachers of govt school in Telangana staged an unique protest, by wearing helmets while teaching against their dilapidated school condition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X