Traffic Challans: చలాన్లపై రాయితీకి భారీగా స్పందన.. సర్కార్ ఖజానాకు రూ.66 కోట్లు..

తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల వసూలు చేసేందుకు రాయితీ ప్రకటించింది. దీంతో వాహనదారుల నుంచి మంచి స్పందన వస్తుంది. చాలా మంది వాహనదారులు పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు చెల్లిస్తున్నారు. డిసెంబర్ 26, 2023 నుంచి ట్రాఫిక్ చలాన్లపై రాయితీ ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది డిసెంబర్ 25 వరకు ఉన్న వాటిపై భారీగా రాయితీ ప్రకటించింది.

దీంతో గత 11 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా 76.79 లక్షల చలానాలకు సంబంధించి రూ.66.77 కోట్ల చెల్లింపులు జరిగినట్లుగా పోలీసులు చెప్పారు. ఆ రాయితీ జనవరి 10 వరకు అవకాశం ఉంది. ఇలోగా మరిన్ని చెల్లింపులు ఉండే అవకాశం ఉంది. రాయితీని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్‌, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారానూ చెల్లింపులు స్వీకరిస్తున్నారు.

With the announcement of discount on traffic challans, huge payments are being made

రాష్ట్రప్రభుత్వం బైక్​లు, ఆటోలపై ఉన్న పెండింగ్ చలాన్లకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, కార్లు,హెవీ మోటార్‌‌‌‌ వెహికల్స్‌‌కు 60 శాతం రాయితీ ప్రకటించింది. దీంతో భారీగా చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసి డబ్బులు కొల్లగోడుతున్నారు. దీనిపై కూడా పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేసింది.

గతంలో కూడా ప్రభుత్వం పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీ ప్రకటించింది. అప్పుడు కూడా వాహనాదారుల నుంచి భారీగా స్పందన వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+