కాంగ్రెస్ హైమాండ్ సీరియస్ - రేవంత్ పైన సీనియర్లు ఫిర్యాదు : ఢిల్లీకి రావాలంటూ హుకుం..!!
తెలంగాణలో ఎలాగైనా బలపడాలని చూస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వానికి హుజూరాబాద్ ఫలితం మింగుడు పడటం లేదు. అనూహ్యంగా బీజేపీ పుంజుకోవటం తో అలర్ట్ అయిది. దుబ్బాక.. గ్రేటర్ హైరదాబాద్ .. ఇప్పుడు హుజూరాబాద్ లో బీజేపీ వరుసగా విజయాలు సాధించటం పైన కాంగ్రెస్ నేతలను అప్రమత్తం చేసింది. కొత్త పీసీసీ చీఫ్ గా రేవంత్ కు బాధ్యతలు అప్పగించినా..ఇంత దారుణంగా హుజూరాబాద్ లో ఓట్లు రావటం పైన లెక్కలు తీస్తోంది. ఊహించని విధంగా అతి తక్కువ ఓట్లు రావటంతో.. హుజూరాబాద్ ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది.

ఇంత దారుణంగా ఫలితమా
ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం పడిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపఎన్నిక ఓటమిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వాన్ని అధిష్టానం ఆదేశించింది. ఈ నెల 13న పీసీసీ నేతలు ఢిల్లీకి రావాలంటూ టీ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. కాగా, ఉప ఎన్నిక ఓటమిపై ఇప్పటికే అదిష్టానం కమిటీ వేసింది. ఈ ఓటమికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైఖరే కారణమని కొందరు ఆరోపిస్తుంటే.. పార్టీ కోసం పనిచేయని నేతలు రేవంత్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఇంకొందరు లీడర్లు వాదిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఏమయ్యాయి..
మరీ ఇంత దారుణమైన ఫలితం ఎందుకు వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై చర్చించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు అభ్యర్థిగా బరిలోకి దిగిన బల్మూరి వెంకట్‌ను ఈ నెల 13న ఢిల్లీ రావాల్సిందిగా హై కమాండ్ నుంచి పిలుపు వచ్చింది. మరోవైపు తెలంగాణలోని కొందరు కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారని సమాచారం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో సరిగ్గా శ్రద్ధ పెట్టలేదని.. ఆ కారణంగానే ఈ రకమైన దారుణమైన ఫలితాలు వచ్చాయని కొందరు లీడర్లు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ అభ్యర్ధి గెలుపు కోసం కాంగ్రెస్ పరోక్షంగా సహకరించిందనే ఆరోపణలు ఉన్నాయి.
Recommended Video

బీజేపీ పుంజుకోవటం పైన ఏఐసీసీ అలర్ట్
బీజేపీని గెలిపించటం ద్వారా టీఆర్ఎస్ ను దెబ్బ తీయటం కోసం పరోక్షంగా సహకరించారనే వాదన పొలిటికల్ సర్కిల్స్ లో కొనసాగుతోంది. అయితే, హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తొలి నుంచి నిర్లక్ష్యంగానే వ్యవహరించిందనే అభిప్రాయం ఉంది. అభ్యర్దిని తేల్చకపోవటం.. చివరి నిమిషంలో కొత్త అభ్యర్దిని బరిలోకి దించటం ..ప్రచారంలో సమన్వయం లేకపోవటం వంటివి ఈ పరిస్థికి కారణంగా చెబుతున్నారు. అయితే, అనూహ్యంగా బీజేపీ పుంజుకోవటాన్ని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీని పైన పూర్తి స్థాయిలో చర్చించి..నేతలకు దిశా నిర్దేశం చేసేందుకే ఢిల్లీకి పిలిపించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications