డబ్బంతా మద్యానికే తగిలేస్తావా?: భర్త మర్మంగాన్ని కోసేసింది

Subscribe to Oneindia Telugu

కరీంనగర్: అతను కొట్టినా, తిట్టినా భరించింది. మారకపోతాడా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసింది. చివరికి మద్యానికి బానిసైన తన భర్త మర్మాంగాన్ని కోసేసింది ఓ మహిళ. ఈ ఘటన ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. సిరిసేడు గ్రామంలో రవీందర్‌(40), స్వరూపలు దంపతులు. వీరిద్దరూ రోజు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మద్యానికి బానిసైన భర్తతో రోజు గొడవ జరిగేది. కాగా, కూలీ డబ్బులను యజమాని నుంచి తీసుకున్న రవీందర్‌ ఆ మొత్తంతో సోమవారం పీకలదాకా మద్యం తాగాడు.

  Karimnagar Police Use Flying Cameras | Oneindia Telugu | అసాంఘిక శక్తుల కట్టడికి ఫ్లయింగ్ కెమెరా

  ఇంటికి వచ్చిన రవీందర్‌ను కూలీ డబ్బుల గురించి భార్య ఆరా తీసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఉన్న డబ్బులన్నీ తాగుడుకే తగిలేస్తావా? అంటూ ఆగ్రహానికి గురైన స్వరూప.. కూరగాయలు కోసే కత్తితో భర్త మర్మాంగాన్ని కోసివేసింది. గమనించిన స్థానికులు అతడిని జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A woman allegedly chopped her husband's penis in Karimnagar district.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి