వివాహేతర బంధం: ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హతమార్చింది

వివాహేతర సంబంధం కోసం ఓ మహిళ.. కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. కొండపాక మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు

మెదక్: వివాహేతర సంబంధం కోసం ఓ మహిళ.. కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. కొండపాక మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.

కుకునూరుపల్లిలోని పోలీస్‌స్టేషన్‌లో గురువారం తొగుట సీఐ సోమనారాయణసింగ్‌, ఎస్సై ప్రభాకర్‌రెడ్డితో కలిసి గజ్వేల్‌ ఏసీపీ గిరిధర్‌ ఈ మేరకు వివరాలను వెల్లడించారు. హైదరాబాద్‌లోని హకీంపేటకు చెందిన గౌస్‌(45), ఫాతిమా దంపతులకు 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

 A woman allegedly killed her husband with her paramour's help

గౌస్‌ వీడియో, ఫొటోగ్రాఫర్‌గా, ఆటోడ్రైవర్‌గా పనులు చేసేవాడు. సంపాదించిన డబ్బంతా తాగుడు ఖర్చు చేయడంతో పాటు భార్యను హింసించేవాడు. ఈ క్రమంలో గౌస్‌ మిత్రుడైన అక్బర్‌కు ఫాతిమా సన్నిహిత సంబంధం ఏర్పడింది. దీంతో అతనితో కలిసి భర్తను
చంపించాలని పథకం వేసింది. అక్బర్‌ తన తమ్ముడు ఆరిఫ్‌కు ఆ బాధ్యత అప్పగించి రూ.70 వేలు ఇచ్చాడు.

ఆరిఫ్‌ తన మిత్రులైన తాడూరి భాస్కర్‌(25), ముదినోల్ల శివ(26), శ్రావణ్‌(25)లతో కలిసి హత్య చేసేందుకు కుట్ర పన్నారు. జనవరి 21న అక్బర్‌.. గౌస్‌ ఇంటికి వెళ్లి ఫొటోలు తీయాలి రమ్మంటూ ఆటోలో ఎక్కించుకుని వెళ్లి తన తమ్ముడు ఆరిఫ్‌కు అప్పగించాడు.
వారంతా కొండపాక మండలం వెలికట్ట శివారులోని సిరి డెవలపర్స్‌ ప్లాట్లలోకి తీసుకెళ్లి ఇనుపరాడ్‌తో కొట్టి చంపి శవాన్ని అక్కడే పడేసి వెళ్లారు.

తొగుట సీఐ విచారణలో భాగంగా గౌస్‌ సోదరులను పిలిపించి విచారించగా ఫాతిమా పైనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. విచారణలో నేరం అంగీకరించడంతో ఫాతిమాతో పాటు ఆమె ప్రియుడు అక్బర్‌, అతని తమ్ముడు ఆరిఫ్‌, భాస్కర్‌, శివలను అరెస్ట్‌ చేసినట్టు ఏసీపీ గిరిధర్‌ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+