జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగిత్యాలలో దారుణం.. మహిళపై యాసిడ్ దాడి.. పరిస్థితి విషమం,ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి...

|
Google Oneindia TeluguNews

జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలంలోని తిమ్మాపూర్ తండాలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. స్థానిక బస్టాండ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. దాడి అనంతరం దుండగులు అక్కడినుంచి పరారయ్యారు. బాధితురాలిని స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.

మీషా ఘోషల్ ట్రెడిషినల్ లుక్ ట్రెండింగ్.. అందంగా ముద్దు ముద్దుగా...

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

పోలీసుల కథనం ప్రకారం... ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండాకు చెందిన భుక్యా స్వాతికి,అదే మండలంలోని డబ్బా గ్రామానికి చెందిన రవితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆర్నెళ్ల క్రితం రవి చనిపోయాడు. అప్పటినుంచి బాధితురాలు ఒంటరిగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం స్వాతి పుట్టింటికి వెళ్లింది. బుధవారం(డిసెంబర్ 23) తిరిగి తిమ్మాపూర్ తండాకు వచ్చింది.

మెట్‌పల్లిలో బస్సు ఎక్కి సాయంత్రం సమయంలో తండా బస్టాండ్‌కి చేరుకుంది. అక్కడినుంచి నడుచుకుంటూ ఇంటికి బయలుదేరగా.. బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె ముఖంపై యాసిడ్ పోసి పరారయ్యారు.

విషమంగా బాధితురాలి పరిస్థితి...

విషమంగా బాధితురాలి పరిస్థితి...

ఈ దాడిలో మహిళ ముఖం కుడి వైపు పూర్తిగా కాలిపోయింది. స్థానికులు బాధితురాలిని వెంటనే మెట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలు స్వాతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. బాధితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి...

ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి...

యాసిడ్ దాడి విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఎస్పీ సింధూశర్మతో ఫోన్‌లో మాట్లాడి బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. నిందితులని త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ సింధూశర్మ హుటాహుటిన మెట్‌పల్లిలో బాధితురాలు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకుని ఆమెను పరామర్శించారు. బాధితురాలికి ధైర్యం చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి పలు వివరాలు సేకరించారు. నిందితులను వీలైనంత త్వరగా ట్టుకుంటామని చెప్పారు.

English summary
Swati,a married woman in Jagtial district was attacked by acid on Wednesday evening while she was returning to her home from Metpally.Present she is getting treatment in Metpally private hospital but her condition is serious as per the reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X