చిట్టీల పేరుతో రూ.10 కోట్లతో ఉడాయించింది (పిక్చర్స్)
హైదరాబాద్: 55 ఏళ్ల ఓ మహిళ చిట్టీల పేరుతో దాదాపు అరవై మందిని రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు మోసం చేసి ఉడాయించిన సంఘటన హైదరాబాదులో జరిగింది. ఆమె గత పదేళ్లుగా స్థానికంగా చిట్టీలు నడుపుతోంది.
నిందితురాలి పేరు అరుణా రెడ్డి. ఆమె నెరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటోంది. ప్రస్తుతం కోట్లాది రూపాయలతో ఆమె ఉడాయించింది. బాధితులు అరుణా రెడ్డి పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు నలభై మంది బాధితులు తమకు ఫిర్యాదు చేశారని నేరేడుమెట్ పోలీసులు తెలిపారు.
వారు అరుణా రెడ్డి పైన ఫిర్యాదు చేశారని చెప్పారు. ఆమె బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చునని పోలీసులు తెలిపారు. నిందితురాలు చిట్టీలతో పాటు వడ్డీ వ్యాపారం కూడా నిర్వహించేది.

నేరేడుమెట్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. నేరేడ్‌మెట్ డిఫెన్స్ కాలనీలో ఉంటున్న అరుణా రెడ్డి పది ఇరవై ఏళ్లుగా చిట్టీలు నిర్వహించడంతోపాటు వడ్డీ వ్యాపారం చేస్తోంది. ఆమె భర్త రఘనాథ రెడ్డి మాజీ సైనిక ఉద్యోగి. ఆమె వద్ద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చిట్టీలు వేశారు.
కాలపరిమితి ముగిసిన తర్వాత నెలకు రూ.3 చొప్పున వడ్డీ ఇస్తానని నమ్మించి సభ్యుల డబ్బులు వాడుకుంది. అసలు, వడ్డీ ఇవ్వకపోవడంతో ఒత్తిడి తేగా ఏప్రిల్ 2న తన స్థలం విక్రయించి డబ్బులు చెల్లిస్తానని అందరిని నమ్మించారు.

ఏప్రిల్ 25న ఇంటికి తాళం వేసి భర్తతోపాటు ఆమె పత్తాలేకుండా పోయారు. ఆమె సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది. బాధితులు అక్కడి నుంచి పోలీసు స్టేషన్‌కు వెళ్లి అరుణా రెడ్డి, ఆమె భర్త రఘునాథ రెడ్డి, మధ్యవర్తిగా ఉన్న వారి వియ్యంకుడు హేమంత్ రెడ్డిలపై ఫిర్యాదు చేశారు.
అరుణారెడ్డి నుంచి అత్యధికంగా డబ్బులు రావాల్సిన వారిలో రమాదేవి (రూ.50 లక్షలు), రాధ (రూ.40 లక్షలు), విజయరత్న (రూ.26 లక్షలు), ప్రమీల (రూ.25 లక్షలు), శేషారత్నం (రూ.20 లక్షలు) ఉన్నారు. రెండు లక్షల నుంచి ఐదు లక్షల మంది ఇచ్చిన వాళ్లే చాలామంది ఉన్నారు.












Click it and Unblock the Notifications