హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళ ఆత్మహత్య: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 557 మందిపై కేసు నమోదు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ‘నా చావుకు ఎవరూ కారణం కాదు' అని నోట్ రాసి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని మలేసియా టౌన్‌షిప్‌లో చోటు చేసుకుంది. కేపీహెచ్‌బీ పోలీసుల కథనం ప్రకారం కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీకాంత్, జ్యోత్స్న గతకొంతకాలంగా కేపీహెచ్‌బీలోని వసంతనగర్‌లో నివాసం ఉంటున్నారు.

శ్రీకాంత్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తుండగా, జ్యోత్స్న ఇంటిపట్టునే ఉంటుంది. వీరికి ఏడాదిన్నర పాప ఉంది. రోజూ లాగే గురువారం ఉదయం 9 గంటలకు ఉద్యోగానికి వెళ్లిన శ్రీకాంత్ మధ్యాహ్నాం జ్యోత్స్నకు ఫోన్ చేశాడు. దీంతో ఆమె ఫోన్ తీయలేదు.

కంగారు పడిన శ్రీకాంత్ వాచ్‌మెన్‌కు ఫోన్ చేసి తన ఇంటికి వెళ్లమని చెప్పాడు. వాచ్‌మెన్ వెళ్లి తలుపు తట్టుగా తీయలేదు. అంతేకాదు లోపలి నుంచి పాప ఏడుపు వినిపించింది. దీంతో తలుపులు పగలగొట్టి చూడగా శ్రీకాంత్ భార్య జ్యోత్స్న ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది.

Woman committed suicide with sickness in KPHB, Hyderabad

వెంటనే జరిగిన విషయాన్ని వాచ్‌మెన్ శ్రీకాంత్‌కు ఫోన్‌లో తెలియజేశాడు. దీంతో వెంటనే ఇంటికి వచ్చిన శ్రీకాంత్ పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా సూసైడ్ నోట్ దొరికింది. అందులో ‘నా చావుకు ఎ వరూ కారణం కాదు. అనారోగ్యం కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నా' అని రాసిపెట్టి ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ : 557 మందిపై కేసు నమోదు

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం రాత్రి నగరంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 557 మంది మందుబాబులపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సందర్భగా పోలీసు ఉన్నాతాధికారి ఒకరు మాట్లాడుతూ న్యూ ఇయర్ సందర్భంగా గురువారం రాత్రి 10.00 గంటల నుంచి ఆర్థరాత్రి రెండు గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినట్లు చెప్పారు.

English summary
Woman committed suicide with sickness in KPHB, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X