మహిళపై రేప్: నిందితులు వీరే (ఫొటోలు)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని కూకట్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం ఓ మహిళకు బలవంతంగా మద్యం తాగించి తాగిన మత్తులో ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడికట్టిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి గురైన మహిళ తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకున్న అనంతరం గురువారం కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించింది

ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా ఒకరు పరారీలో ఉన్నట్టు తెలిసింది. కూకట్‌పల్లి దీనబంధు కాలనీలో నివాసముంటున్న బాధితురాలు(40) నిజాంపేట్ రోడ్డులోని స్ప్రింగ్ కంపెనీలో కూలి పనిచేస్తోంది. భర్త సంవత్సరం క్రితం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఆమె ఇద్దరి పిల్లలకు వివాహం కావడంతో ఒంటరిగా జీవిస్తోంది.
భర్తతో పరిచయం ఉన్న శ్రీనివాస్ అదే కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. పాతపరిచయం నేపథ్యంలో దీనబంధుకాలనీలో ఉంటున్న బాధితురాలి ఇంటికి వస్తూ పోతుంటాడు. ఈక్రమంలో ఈనెల 3న రాత్రి శ్రీనివాస్ బాధితురాలి ఇంటికి స్నేహితులైన ఎల్లమ్మబండ ప్రాంతానికి చెందిన రవి, వెంకటేష్‌ను తీసుకొని వచ్చి ముగ్గురూ కలిసి మద్యం సేవించారు. అనంతరం బాధితురాలికి మద్యం తాగించి మత్తులో సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

మరుసటి రోజు తెల్లవారుజామున పక్కింటివారి సహాయంతో తీవ్ర అనారోగ్యంగా ఉన్న బాధితురాలిని బంధువుల ఇంటికి తీసుకువెళ్లారు. దీంతో ఆ మహిళ బంధువుల ఇంట్లో ఉండి చికిత్స అనంతరం గురువారం కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శ్రీనివాస్‌తో పాటు అతని స్నేహితుడు రవిని అదుపులోకి తీసుకోగా వెంకటేష్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications