కూకట్‌పల్లిలో మహిళపై సామూహిక అత్యాచారం
హైదరాబాద్: దేశంలో నిర్భయ చట్టం అమల్లోకి తీసుకొచ్చినా మహిళలపై ఆగడాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలపై లైంగిక దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ ఓవైపు ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా కామాంధులుమాత్రం ఇవేమీ పట్టడం లేదు.
తాజాగా హైదరాబాద్‌లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కూకట్ పల్లి సమీపంలో ఉన్న ధీనబంధు కాలనీలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

మొదట ఆమెకు మత్తుమందు ఇచ్చి అనంతరం దుండగులు ఆమెపై అత్యాచారం చేశారు. ఘటనపై బాధితురాలు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు శ్రీనివాస్, వెంకటేష్, రవిగా గుర్తించారు. కాగా నిందితుడు శ్రీనివాస్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కారు డ్రైవర్ కావడం విశేషం.












Click it and Unblock the Notifications