బాలికపై సెక్యూరిటీ గార్డ్ అత్యాచారం, ఒకే కాన్పులో నలుగురు జననం
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ ఇందిరా నగర్ కాలనీలో దారుణం జరిగింది. నాగేందర్ అనే సెక్యూరిటీ గార్డు ఎనిమిదేళ్ల బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. నాగేందర్ పైన కేసు పెట్టిన పోలీసులు, అతని కోసం గాలిస్తున్నారు. కాగా అతను ఓ వర్ధమాన నటుడి ఇంట్లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడని తెలుస్తోంది.

తెలంగాణలో రైతు ఆత్మహత్య
తెలంగాణలో రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లాలో అప్పుల బాధలేక కోహిర్ మండలం చింతలఘట్టుకు చెందిన అనిల్ అనే రైతు ఉరివేసుకొని చనిపోయాడు.
అనిల్ తనకు ఉన్న నాలుగు ఎకరాలతో పాటు మరో నాలుగు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. వర్షాభావం వల్ల సేద్యం సరిగా సాగకపోవడంతో అప్పులపాలు అయ్యాడు. బాకీలు తీర్చే దారిలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
ఒకే కాన్పులో నలుగురు జననం
హైదరాబాదులో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మను ఇచ్చింది. నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో రజిత అనే మహిళ ముగ్గురు మగ శిశువులకు, ఓ ఆడ శిశువుకు జన్మను ఇచ్చింది. తల్లి, చిన్నారులు క్షేమంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications