ఖమ్మం జిల్లాలో సైకో హాల్‌చల్, చైన్ స్నాచర్ దాడిలో మహిళకు తీవ్ర గాయాలు
హైదరాబాద్: ఈ మధ్య కాలంలో నగరంలో చైన్ స్నాచర్ల దాడులు ఎక్కువయ్యాయి. తాజాగా బుధవారం బైక్‌పై వెళ్తున్న మహిళపై ఆగంతకుడు దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం బాట సింగారం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది.
చైన్ స్నాచర్ దాడిలో బైక్‌పై నుంచి కిందపడిన మహిళ తీవ్రంగా గాయపడింది. దీంతో స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాలో సైక్ హాల్‌చల్

జిల్లాలోని సులానగర్ గ్రామంలో ఓ సైకో వీరంగం సృష్టించింది. రోడ్డుపై వెళ్లే వారిపై దాడికి దిగింది. ఓ ఆటోను ఆపి ప్రయాణికులపై రాళ్లు విసిరింది. కర్ర తీసుకుని కనిపించిన వారిని కొట్టసాగింది. సైకో చేసిన దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గతంలో కూడా ఇదే సైకో అంబులెన్స్ అద్దాలను పగులగొట్టిందని స్థానికులు చెప్పారు.
భద్రాచలం బస్టాండ్‌లో తుపాకి మిస్‌ఫైర్
ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ తుపాకీ మిస్‌ఫైర్ అయింది. బుధవారం ఉదయం బస్టాండ్ ఆవరణలో ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లాడు. ఆ సమయంలో తుపాకీని భుజానికి తగిలించుకోవడంతో ట్రిగ్గర్ వీపుకి తగిలి ఫైర్ అయింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగకపోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications