వివాహేతర సంబంధం : ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
హైదరాబాద్ : వివాహేతర సంబంధాలు ఈమధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. పరాయి వ్యక్తులతో సంబంధాలు సొంత మనుషులను బలితీసుకునేదాకా వెళ్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని శంషాబాద్ పరిధిలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది.

వివాహేతర సంబంధం పెట్టుకున్న సత్యనారాయణ అనే వ్యక్తితో కలిసి భర్త శ్రీనివాస్ ను దారుణంగా హత్య చేసింది ఓ భార్య. బండరాయితో అతని తలపైన మోది హత్య చేసినట్లుగా తెలుస్తోంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో.. ప్రియుడితో కలిసి అఘాయిత్యానికి పాల్పడింది. విషయం తెలిసిన శంషాబాద్ పోలీసులు.. సదరు భార్యతో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకోగా.. ఇద్దరు నేరం ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications