దొంగలు దొరికేనా?: నిలకడగా చైన్‌స్నాచర్ల దాడిలో గాయపడ్డ మహిళ ఆరోగ్యం

హైదరాబాద్: ఉస్మానియా లా కాలేజ్ వద్ద జులై 17న చైన్ స్నాచర్ దాడిలో సునీత (40) మరణించిన ఉదంతం మరువక ముందే అలాంటి సంఘటనే మలక్‌పేట్‌లో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.

నగరంలోని మలక్‌పేట ఫ్లైఓవర్‌ దగ్గర అర్ధరాత్రి చైన్‌ స్నాచర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. మలక్ పేట ఎంసీహెచ్ కాలనీకి చెందిన దంపతులు బైక్‌పై వెళుతుండగా వారిని వెంబడించిన చైన్ స్నాచర్లు వర్ధనమ్మ మెడలోని నాలుగు తులాల గొలుసును లాక్కెళ్లారు.

woman succumbs to injuries in chain snatching incident hyderabad

దీంతో వర్దనమ్మ (50) బైక్‌పై నుంచి కిందపడి తలకు తీవ్ర గాయమైంది. ఆమెను సమీపంలోని యశోద ఆసుపత్రికి తరలించారు. చైన్ స్నాచింగ్ గాయపడిన వర్ధనమ్మకు కుడిభుజం, ఛాతి భాగాల్లో గాయలయ్యాయని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు ఎటువంటి ప్రాణాపాయం లేదని బాధితురాలి పరిస్థితిని వివరించారు.

ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, మరో 24 గంటలు ఆసుపత్రిలోనే ఉంచనున్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వర్దనమ్మ హిమయత్ నగర్‌లోని రెవెన్యూ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు చాదర్‌ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ పుటేజీల ఆధారంగా దొంగలను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+