Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మంత్రి హరీశ్ సభలో మహిళ ఆత్మహత్యా యత్నం, సర్పంచ్‌ను చెప్పుతో కొట్టిన టీఆర్ఎస్ నేత

హైదరాబాద్: తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సభలో కలకలం రేగింది. ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లిలో తెలంగాణ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్న బహిరంగసభలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మార్కెట్ యార్డులో శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది.

మార్కెట్ యార్డులోని సభలో మంత్రి హరీశ్ రావు ప్రసంగిస్తుండగా, అ సమయంలో ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన వరలక్ష్మి తాండూర్‌ జడ్పీటీసీ తన భూమి ఆక్రమించాడని, పోలీసులకు తెలిపినా పట్టించుకోలేదని మంత్రి ఎదుటే పురుగుల మందు తాగింది.

దీంతో అప్రమత్తమైన అధికారులు ఆమెను చికిత్స కోసం ఆమెను సమీపంలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

 woman suicide attempt in minister harish rao meeting at adilabad

సర్పంచ్‌ను చెప్పుతో కొట్టిన టీఆర్ఎస్ నేత

నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని టీఆర్ఎస్ లీడర్ ఒకరు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. మఠంపల్లి మండలం అల్లీపురం గ్రామపంచాయతీ సర్పంచ్ పిచ్చిరెడ్డిని ఆ గ్రామ టీఆర్ఎస్ లీడర్ గోలి రవి శుక్రవారం చెప్పుతో కొట్టాడు.

దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరికీ సర్దిచెప్పి పంపించారు. ఈ సంఘటన మఠంపల్లి మండల కార్యాలయంలో చోటుచేసుకుంది. కాగా టీఆర్ఎస్ నేత తీరుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+