భార్య కడుపు మాడ్చి, అస్తిపంజరంలా మార్చి.. విగతజీవిని చేసిన దారుణం!
సమాజంలో రోజురోజుకు దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటికి నిన్న గర్భంతో ఉన్న భార్యను చంపి రంపంతో ముక్కలుగా కోసి, కవర్లలో ప్యాక్ చేసి మూసీనదిలో పారేసిన ఘటన తెలుగురాష్ట్రాల ప్రజలను ఆవేదనకు గురి చెయ్యగా, తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను గృహనిర్బంధం చేసి రెండేళ్లుగా కడుపు మాడ్చి, ఎముకల గూడులా తయారుచేసి చివరికి విగత జీవిగా మార్చిన ఘటన సభ్య సమాజాన్ని ఆవేదనలో ముంచింది.
ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన
ఇక ఈ ఘటన వివరాలలోకి వెళితే ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముచ్చర్ల పరిధిలోని విశ్వనాథం పురానికి చెందిన లక్ష్మీ ప్రసన్న ను అదే మండలానికి చెందిన నరేష్ బాబుకు ఇచ్చి 2015లో వివాహం జరిపించారు. 9 సంవత్సరాల క్రితం వారికి ఒక కుమార్తె పుట్టింది. తర్వాత నరేష్ బాబు ఆరేళ్లపాటు భార్యతో కలిసి అత్తగారి ఇంట్లోనే ఉన్నాడు.

భార్య మెట్లపై నుండి పడిందని అత్తామామలకు అల్లుడు ఫోన్
ఆపై భార్యాబిడ్డలతో కలిసి అశ్వరావుపేట కు వచ్చే అక్క బావ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. అయితే మహేష్ బాబు అత్తమామలకు ఫోన్ చేసి లక్ష్మీ ప్రసన్న ఇంట్లో మెట్ల పైనుంచి కింద పడడంతో గాయాలయ్యాయని, దగ్గరలోని రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చేర్పించామని చెప్పారు. దీంతో వారు ఆసుపత్రికి వెళ్ళగా అప్పటికే లక్ష్మీ ప్రసన్న మృతి చెంది ఉంది.
విగత జీవిగా ఉన్న కూతుర్ని గుర్తు పట్టలేకపోయిన తల్లిదండ్రులు
కూతురి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు తమ కూతురిని గుర్తుపట్టలేక కన్నీరు మున్నీరుగా రోదించారు. ఆమె శరీరమంతా గాయాలు అంతకుముందు గాయాలు మానిన గుర్తులు ఉండడంతో పాటు ఎముకల గూడు లాగా కూతురు మారడం చూసి తమ కుమార్తెను చిత్రహింసలు పెట్టి, ఆ స్థితికి తీసుకువచ్చి చంపేశారని తల్లిదండ్రులు లబోదిబో మన్నారు.
అదనపు కట్నం కోసం గృహ నిర్బంధం, హింస
లక్ష్మీ ప్రసన్నను అదనపు కట్నం కోసం నరేష్ బాబు, అతని తల్లి, అక్క, బావలు హింసించే వారని లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు ఆరోపించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.గత రెండేళ్లుగా తమను తమ కుమార్తెతో మాట్లాడనివ్వలేదని, అశ్వరావుపేట కు వెళ్లిన తర్వాత ఒక సంవత్సరం పాటు తమ కుమార్తె తమతో మాట్లాడిందని, ఆ తర్వాత రెండేళ్ల నుంచి ఆమెను చూపించలేదన్నారు.
అన్నం కూడా పెట్టకుండా ఎముకల గూడులా మార్చి చంపేశారని తల్లిదండ్రుల ఆవేదన
ఫోన్ చేసిన మాట్లాడనివ్వలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు ఎకరాల మామిడితోట, అర ఎకరం పొలం తో పాటు, పది లక్షల నగదు, 10 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను కట్నంగా ఇచ్చి పెళ్లి చేశామని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కుమార్తెను గృహనిర్బంధం చేసి, భోజనం కూడా పెట్టకుండా చంపేశారని భర్త, అత్త, అక్క, బావలపై ఫిర్యాదు చేసిన లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications