లాడ్జిలో వ్యభిచారం: మహిళ సహా ముగ్గురి అరెస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపుతున్న నిందితురాలితో పాటు సహకరిస్తున్న ఓ లాడ్జి నిర్వాహకుడిని, రిసెప్షనిస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించిన వివ రాలను డీసీపీ వెల్లడించారు.మహబూబ్‌నగర్‌‌లోని మెట్టుగడ్డ పద్మావతి కాలనీకి చెందిన కళావతి (28) భర్త నాలుగేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి నుంచి ఆమె వ్యభిచార వృత్తి సాగిస్తోంది.

 women arrested in prostitution ring

అదే ప్రాంతానికి చెందిన సువర్ణ (27) భర్తను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆమెను కూడా కలుపుకొని సికింద్రాబాద్‌కు వచ్చి రైల్వే స్టేషన్‌ వద్ద వ్యభిచార వృత్తిని కొనసాగిస్తున్నారు.

స్థానికంగా ఉన్న ఓ లాడ్జి రిసెప్షనిస్ట్, లాడ్జి నిర్వాహకుడు, మేనేజర్‌‌లతో కలిసి లాడ్జిని వ్యభిచార గృహంగా మార్చారు. ఈ నెల 15న బేగంపేట్‌ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నేతృత్వంలో దాడి చేసి నిందితులు వారిని అరెస్టు చేశారు. ఓ నిందితుడు పరారీలో ఉన్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Women and Lodge owner arrested in prostitution ring in Hyderabad on Thursday.
Please Wait while comments are loading...