తెలంగాణలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం రేపట్నుంచే: ఆర్డీనరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనే

తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డిసెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాష్ట్రంలో బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు టీఎస్ఆర్టీసీ (TSRTC) బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం ఒకటిగా ఉన్న విషయం తెలిసిదే.

జీవో నెంబర్ 47 ద్వారా మహాలక్ష్మి పథక విధి విధానాలను ప్రభుత్వం వెల్లడించింది. కాగా, మహాలక్ష్మి పథకం కింద పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ప్రయాణికుల ఛార్జీ మొత్తాన్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. ఈ పథకంకు సంబంధించిన వివరాలను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.

women free travel in tsrtc buses from december 9th afternoon

తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని సజ్జనార్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ్నుంచి ఎక్కడికైనా ఆర్డీనరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందన్నారు. జీరో టికెట్ తో మహిలలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. మొదటి వారంలో ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండానే మహిళలు ప్రయాణించవచ్చు. ఆ తర్వాత మాత్రం మహిళలు గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందని సజ్జనార్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు, ఆడపిల్లలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో మాత్రం ఆర్డీనరీ, ఎక్స్ ప్రెస్, మెట్రో బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు. ప్రత్యేక బస్సులు, ప్రత్యేక టూర్ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రజా రవాణా పెరుగతుందన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చారిత్రక నిర్ణయమన్నారు. ఆర్టీసీకి లోటును ప్రభుత్వం భర్తీ చేస్తుందని సజ్జనార్ తెలిపారు.

కోవిడ్ తర్వాత దేశ వ్యాప్తంగా ప్రైవేటు వాహనాల సంఖ్య పెరిగిందని.. దీంతో ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడిందని సజ్జనార్ తెలిపారు. పెరుగుతున్న వాహనాల వల్ల రోడ్డు ప్రమాదాలు, కాలుష్యం పెరుగుతోందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల మహిళలకు రక్షణ ఉంటుందన్నారు. ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని చెప్పారు. ప్రస్తుతం 7200 సర్వీసులను మహాలక్ష్మి పథకం కోసం ఉపయోగిస్తామని తెలిపారు. రద్దీని బట్టి ఆ సంఖ్యను పెంచుతామని తెలిపారు.

మహాలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని సజ్జనార్ చెప్పారు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఈ పథకం ప్రారంభిస్తామన్నారు. మహిళా మంత్రులు, సీఎస్, ఎమ్మెల్యేలు, మహిళా ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+