హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో భారతీ ఎయిర్‌టెల్ భారీ పెట్టుబడి: హైదరాబాద్‌లో 2వే కోట్లతో డేటా సెంటర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రూ. 2వేల కోట్లతో పెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, భారతీ గ్రూప్ ఫౌండర్ సునీల్ మిట్టల్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. భారతీ ఎయిర్ టెల్ సంస్థకు చెందిన డేటా సెంటర్ విభాగం నెక్స్‌ట్రా సెంటర్ ముందుగా మౌలిక సదుపాయాల కోసం కొంత మొత్తం పెట్టుబడులుగా పెట్టనుంది.

 World economic forum investments: Bharti Airtel to set up ₹2,000-crore data centre in Hyderabad

ఆ తర్వాత వినియోగదారుల నుంచి వచ్చే పెట్టుబడులను డేటా సెంటర్ ను అభివృద్ధి చేసేందుకు వినియోగించనున్నట్లు తెలిపింది. తొలి విడతగా 60 మెగావాట్ల కెపాసిటీతో హైపర్ స్కేల్ డేటా సెంటర్‌ను నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. రాబోయే ఐదు నుంచి ఏడేళ్ల కాలంలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని భారతీ ఎయిర్ టెల్ పేర్కొంది.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌తో భారతీ ఎయిర్‌టెల్‌ వ్యవస్థాపకుడు సునీల్‌ భారతి మిట్టల్‌, వైస్‌ ఛైర్మన్‌ రాజన్‌ భారతి మిట్టల్‌ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. తెలంగాణలో ఎయిర్‌టెల్‌ పెట్టుబడులు పెట్టడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్‌ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎయిర్‌టెల్‌-నెక్స్‌ట్రాతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని అన్నారు. భవిష్యత్తులో భారతీ ఎయిర్ టెల్ కు చెందిన మరిన్ని విభాగాలను తెలంగాణలో విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు ఆ గ్రూప్ ఛైర్మన్ సునీల్ మిట్టలు తెలిపారు.

English summary
World economic forum investments: Bharti Airtel to set up ₹2,000-crore data centre in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X