తెలంగాణలో అద్దిరిపోయే రైల్వే స్టేషన్.. !!

Yadadri Railway Station: తెలంగాణలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదాద్రికి కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఇక్కడి రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే చర్లపల్లి తరహాలో ఇప్పుడున్న వాటి కంటే అదనపు రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఈ నిర్మాణ పనులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పరిశీలించారు.

అమృత్ భారత్ కింద తెలంగాణలో సికింద్రాబాద్ సహా మలక్‌పేట్, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్, మల్కాజ్‌గిరి, ముద్ఖేడ్, ఆదిలాబాద్, రామగుండం, కరీంనగర్, మహబూబాబాద్, హైటెక్ సిటీ, హఫీజ్‌పేట్, జహీరాబాద్, తాండూరు, భద్రాచలం రోడ్, హుప్పుగూడ, యాదాద్రి, ఖాజీపేట్ జంక్షన్, మధిర.. వంటి అనేక రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే.

Yadadri Railway Station in Telangana Redevelopment Gets a New Look as SCR GM Inspects Ongoing Works

మొదటి విడతలో ఆయా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుంది సంబంధిత మంత్రిత్వ శాఖ. దీనికోసం ఒక్కో రైల్వే స్టేషన్‌కు గరిష్ఠంగా 25 కోట్ల రూపాయలను కేటాయించింది కూడా. దీని ఆధారంగా అక్కడి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో భాగంగా యాదాద్రి స్టేషన్ అభివృద్ధికి 24.45 కోట్ల రూపాయలను కేటాయించింది. నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. లక్ష్మీనరసింహ స్వామివారు వెలిసిన యాదాద్రి ఆలయ శిఖరాన్ని పోలిన విధంగా ఈ రైల్వే స్టేషన్ ముఖ ద్వారం రూపుదిద్దుకుంటోండటం ప్రధాన ఆకర్షణ.

నిర్మాణ పనుల పురోగతిని సంజయ్ కుమార్ శ్రీవాస్తవ స్వయంగా పరిశీలించారు. చర్లపల్లి- యాదాద్రి సెక్షన్ లో ట్రాక్, సిగ్నలింగ్ సిస్టమ్ ను ఆయన పరిశీలించారు. దీనికోసం విండో ఇన్ స్పెక్షన్ చేపట్టారు. యాదాద్రి రైల్వే స్టేషన్ చేరిన తర్వాత క్షేత్రస్థాయిలో నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ సహా పలువురు ఉన్నతాధికారులు ఆ సమయంలో ఆయన వెంట ఉన్నారు.

ఇప్పటిదాకా సుమారు 58 శాతం పనులు పూర్తయ్యాయి. ప్లాట్‌ఫామ్ కాలమ్స్ నిర్మితం అయ్యాయి. స్టేషన్ భవనం, అదనపు ప్లాట్ ఫామ్‌లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇదే అమృత్ భారత్ పథకం కింద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ సైతం పునర్నిర్మితమౌతోన్న విషయం తెలిసిందే. 700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పనులు కొనసాగుతున్నాయి. మూడు దశల్లో పూర్తి కానున్నాయి. వచ్చేే 40 సంవత్సరాల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ తరహాలో ఈ స్టేషన్ పునర్నిర్మితం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+