యాదగిరిగుట్ట కేసీఆర్ ఇంటి వ్యవహారం కాదు.!సీఎంపై మండిపడ్డ డీకే అరుణ.!

యాదగిరి గుట్ట/హైదరాబాద్: యాదగిరి గుట్ట లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయ ప్రారంభోత్సవం రాజకీయ విమర్శలకు తావిస్తోంది. యాదాద్రి జిల్లాలోని చాలా మంది రాజకీయ ప్రముఖులకు ఆహ్వనం పంపకుండానే కార్యక్రమాన్ని ముగిస్తున్నారన్న విమర్శాలు సీఎం చంద్రశేఖర్ రావు మీద వ్యక్తం అవుతున్నాయి. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఇదే అంశంలో సీఎం చంద్రశేఖర్ రావు వ్యవహారాన్ని తప్పుబట్టారు.

తాజాగా యాదగిరిగుట్ట తన సొంత ఆస్తి కాదని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. సోమవారం గోవాలో నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజ్జరైన డీకే అరుణ, యాదగిరిగుట్ట ప్రారంభోత్సవంలో జరిగిన విషయాలపై స్పందించారు.

Yadagirigutta is not a KCR personal affair.! DK Aruna angry with CM.!

ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న యాదగిరిగుట్ట పేరును సీఎం చంద్రశేఖర్ రావు యాదాద్రిగా పేరు మార్చి ప్రజల మనోభావాలు దెబ్బ తీసాడని డీకే అరుణ ఆరోపించారు. తన సొంత భూమిలో ఆలయ నిర్మాణం చేసినట్టు, సొంత పార్టీ నాయకులను ఆలయ శంకుస్థాపనకు పిల్చుకునాడని, మరి రాష్ట్ర మొదటి పౌరురాలైన గవర్నర్ తమిళ సైను ఆలయ ప్రారంభోత్సవానికి అహ్వానించక పోవడం ముఖ్యమంత్రి దురహంకారానికి నిదర్శనమని డీకే అరుణ విమర్శించారు.

మహిళలను గౌరవించలేని ముఖ్యమంత్రి కుర్చీ లో కూర్చునే అర్హత లేదని డీకే అరుణ మండిపడ్డారు. ఎంతో పురాతనమైన ఆలయ పేరు యాదగిరిగుట్టగానే పిలవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజలు ఇచ్చిన దాన ధర్మాల వల్ల ఆలయ నిర్మాణం జరిగిందే తప్ప , తన జేబులో నుంచి ఖర్చు పెట్టలేదన్న అంశం ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని డీకే అరుణ మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+