దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల నిందితుడు భత్కల్ వింత ప్రవర్తన, గులాబీతో జడ్జి ఎదుట
హైదరాబాద్: దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన యాసిన్ భత్కల్‌ను గురువారం నాడు కోర్టు రంగారెడ్డి జిల్లా కోర్టు ఎదుట హాజరుపరిచారు. భత్కల్ పారిపోయేందుకు ప్లాన్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో... జైలులోని సిసి కెమెరాల ఏర్పాటుపై నివేదిక సమర్పించాలని చర్లపల్లి జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.
అభియోగాల నమోదు పైన విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. యాసిన్ భత్కల్ సహా ఐదుగురు చర్లపల్లి జైలుకు హాజరయ్యారు.

కాగా, యాసిన్ భత్కల్ గురువారం నాడు గులాబీ పువ్వుతో హాజరయ్యాడు. జడ్జి ఎధుట గులాబీతో హాజరై అందర్నీ ఆశ్చర్యపరిచింది. రెండు రోజులుగా భత్కల్ వింతగా ప్రవర్తిస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఉగ్రవాది భత్కల్ ఆశ్చర్యపరిచాడు. ప్రవర్తన పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తనను విడిపించేందుకు ఐసిస్ కృషి చేస్తోందని, త్వరలోనే బయటకు వస్తానని కరుడుగట్టిన ఉగ్రవాది యాసిన్ భత్కల్ జైలులోని టెలిఫోన్ నుంచి భార్యకు, స్నేహితులకు చెప్పిన నేపథ్యంలో భత్కల్‌ను ఉంచిన బ్యారక్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.












Click it and Unblock the Notifications